Alcaraz : వింబుల్డన్ టైటిల్ ను యువ సంచలనం అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్ టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కు షాకిచ్చాడు.ఎంతో హోరాహోరీగా సాగిన తుదిపోరులో స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో జకోవిచ్ ను ఓడించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. తొలి సెట్ ఓడినా అద్భుతంగా అల్కరాజ్ పుంజుకున్నాడు.
తొలి సెట్ లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి జకోవిచ్ గెలిచాడు. రెండో సెట్ నుంచి మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అల్కరాజ్ పుంజుకున్నాడు. ఈ సెట్ లో స్కోరు 6-6తో సమకావడంతో టైబ్రేకర్ కు వెళ్లింది. ఇందులో 7-6తో నిలిచిన అల్కరాజ్ సెట్ ను గెలుచుకున్నాడు. ఇదే ఊపులో మూడో సెట్లోనూ అల్కరాజ్ దూకుడు ప్రదర్శించాడు. తొలి సెట్ ఓడినా ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ పై పట్టుసాధించాడు. నాలుగో సెట్ లో జకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించాడు. అల్కరాజ్ జోరుకు కళ్లెం వేశాడు. దీంతో నాలుగో సెట్ ను జకో గెలిచాడు.
దీంతో మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మారింది. ఐదో సెట్ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా సాగిన ఐదో సెట్ లోనూ అల్కరాజ్ అదే జోరును కొనసాగించిన ఛాంపియన్ గా నిలిచాడు.