EPAPER
Kirrak Couples Episode 1

HOLLYWOOD: సినిమా షూటింగ్స్ బంద్.. AI భయంతో సమ్మె..

HOLLYWOOD: సినిమా షూటింగ్స్ బంద్.. AI భయంతో సమ్మె..
hollywood

HOLLYWOOD: అవును, మీరు చదివింది కరెక్టే. టాలీవుడో, బాలీవుడో కాదు.. హాలీవుడ్‌లో సమ్మె జరుగుతోంది. సినిమా షూటింగులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వేతనాలు పెంచాలనో, అదనపు ప్రయోజనాలు కల్పించాలనో కాదు వాళ్లు సమ్మె చేస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI పై భయంతోనే సినీ నటులు యాక్టింగ్ బంద్ చేయడం ఆసక్తికరం.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తక్కువ జీతాల వల్ల కలిగే ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నిరవధిక సమ్మె చేపట్టింది. సమ్మెతో పలు సినిమాలు, సిరీస్‌ల విడుదల ఆలస్యం కానున్నాయి. 63 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నటీనటులు, రచయితలు సమ్మెకు దిగడం ఇదే మొదటిసారి.

హాలీవుడ్‌ సినీ నటులు, రచయితలు కలిసి న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌లో సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. రెండు నెలలుగా రచయితలు పని చేయకపోవడంతో చాలా నిర్మాణ సంస్థలు సినీ పనులను ఆపేశాయి. అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్ట్స్‌ అధ్యక్షుడు, ఫ్రాన్‌ డ్రెఛ్సర్‌తో సహా ఎందరో నటీనటులు రచయితలకు సంఘీభావాన్ని తెలిపారు.


స్టూడియోస్‌, స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌తో ఉన్న సమస్యల వల్ల ఈ రెండు వర్గాల వారు సమ్మెను మొదలుపెట్టారు. వేతన సమస్యలతో పాటు కృతిమ మేథ తమ జీవితాలపై ప్రభావం చూపనుందంటూ ఆందోళన బాట పట్టారు. ఏకంగా 65వేల మంది నటులు సమ్మెకు దిగడం హాలీవుడ్‌పై పిడుగుపాటులా పడింది. నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి.

Related News

Devara Collections Day 1 : బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ… రికార్డులు అన్నీ మాయం..

Dil Raju : వెటరన్ డైరెక్టర్ తో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్… వారసుడి కోసం రిస్క్

HBD Puri Jagannadh: పూరీ చిరకాల కోరిక మెగాస్టార్ తీర్చేనా..?

17 years of chirutha: అవమానాల నుండి గ్లోబల్ స్థాయి ఇమేజ్.. చిరుత మూవీ విశేషాలు ఇవే.!

Devara: సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిందెవరంటే..?

Devara USA Collections : అమెరికా గడ్డ మీద దేవర సేఫ్… ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

Sankranthi Movie 2025: సంక్రాంతి రేసులో ఏకంగా 10 సినిమాలు.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..

Big Stories

×