EPAPER
Kirrak Couples Episode 1

Rahul Gandhi : రాహుల్‌ గాంధీపై డిఫమేషన్‌ కేసు.. కొత్త ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌..

Rahul Gandhi : రాహుల్‌ గాంధీపై డిఫమేషన్‌ కేసు.. కొత్త ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌..

Rahul Gandhi latest news(Politics news today India): రాహుల్‌ గాంధీపై డిఫమేషన్‌ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహుల్‌ పై పరువునష్టం దావా వేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ వేశారు. సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్‌ సుప్రీంకోర్టుకు వెళితే తన వాదన కూడా వినాలని పూర్ణేష్‌ మోదీ ఈ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.


2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ మోదీ ఇంటి పేరును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దొంగలందరికీ మోదీ ఇంటిపేరే ఎందుకు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది.

సూరత్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రోజే లోక్ సభ సచివాలయం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో రాహుల్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రాహుల్‌ కు ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేశారు.


Related News

Mahatma Gandhi Quotes 2024: బాపు సూక్తులే నేటి పాలకుల మార్గాలు.. అవే నిజమైన పాలనకు మార్గదర్శకాలు

Vardhman Boss Duped: సంచలనం!.. రూ.7కోట్లు దోపిడికి గురైన వర్ధమాన్ కంపెనీ బాస్..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం… తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోని పోలీసులు?

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Big Stories

×