EPAPER
Kirrak Couples Episode 1

Rangabali review : నాగశౌర్య హిట్ కొట్టాడా..? రంగబలి మూవీ ఎలా ఉందంటే?

Rangabali review : నాగశౌర్య హిట్ కొట్టాడా..? రంగబలి మూవీ ఎలా ఉందంటే?

Rangabali Movie Review(Latest Tollywood News) : నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన మూవీ రంగబలి. కెరీర్ లో ప్రేమ‌క‌థ‌లే నాగ‌శౌర్య‌కు ఎక్కువ విజ‌యాలు అందించాయి. ల‌వ‌ర్‌బాయ్ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఈ జోనర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించి ప్రయోగాలు చేసినా ఫలించలేదు. దీంతో తనకు కలిసొచ్చిన లవ్ స్టోరీనే నాగశౌర్య మళ్లీ ఎంచుకున్నాడు. రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. న్యూడైరెక్టర్ ప‌వ‌న్ బాసంశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.


క‌థ: శౌర్య అంటే నాగ‌శౌర్య‌కు త‌న ఊరు రాజ‌వ‌రం అంటే ఎంతో ఇష్టం. అందుకే సొంతూరులోనే రాజులా బత‌కాలి అనుకుంటాడు. తను ఏం చేసినా అందరిచూపు త‌న‌పైనే ఉండాల‌నుకునే తత్వం. శౌర్య తండ్రి విశ్వం అంటే గోప‌రాజు ర‌మ‌ణ‌ ఊళ్లోనే మెడిక‌ల్ షాపు నిర్వ‌హిస్తుంటాడు. కొడుక్కి ఆ షాపు బాధ్య‌త అప్ప‌గించాల‌నుకుంటాడు. అయితే శౌర్య మాత్రం ఊళ్లో గొడ‌వ‌లు పెట్టుకుంటూ, తండ్రి దుకాణంలో చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తూ బ‌తికేస్తుంటాడు. ఎలాగైనా కొడుకును దారిలో పెట్టాలన్న లక్ష్యంతో బ‌ల‌వంతంగా వైజాగ్ పంపిస్తాడు విశ్వం.

వైజాగ్ లో శౌర్య‌ ఫార్మ‌సీ ట్రైనింగ్ కోసం ఓ మెడిక‌ల్ కాలేజీలో చేర‌తాడు .అక్క‌డే స‌హ‌జ అంటే యుక్తి త‌రేజాతో లవ్ లో పడతాడు. అయితే సహజ తండ్రి అంటే ముర‌ళీ శ‌ర్మ‌ తొలుత అంగీకారం తెలుపుతాడు. కానీ శౌర్య‌ ఊరు రాజ‌వ‌రం అని తెలియగా మ్యారేజ్ కు నో అంటాడు. దీనికి కార‌ణం ఆ ఊర్లోని రంగ‌బ‌లి సెంట‌ర్‌. మ‌రి ఆ సెంట‌ర్ క‌థేంటి? ఈ సెంట‌ర్‌కు ముర‌ళీ శ‌ర్మ‌కు ఉన్న సంబంధం ఏంటి? త‌న లవ్ ను పెళ్లి పీట‌లెక్కించేందుకు శౌర్య ఏం చేశాడు? అన్న‌ది మిగతా కథ.


ఎలా సాగిందంటే : ఫస్టాఫ్ ఫ‌న్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సాగింది. ఎదుటివాడు సంతోషంగా ఉంటే త‌ట్టుకోలేని అగాధం పాత్ర‌లో స‌త్య న‌టన కామెడీని పండించింది. స‌త్య కామెడీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. విరామానికి ముందు ఓ చ‌క్క‌టి ట్విస్ట్‌తో అస‌లు క‌థను ఆరంభించిన తీరు బాగుంది. సెకండాఫ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లా సీరియ‌స్‌గా సాగుతుంది. రంగ‌బ‌లి సెంట‌ర్ పేరు మార్చ‌డం కోసం శౌర్య చేసే ప్ర‌య‌త్నాలు కామెడీగా ఉంటాయి.

ఎవ‌రెలా చేశారంటే : ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హా పాత్ర‌లు పోషించ‌డం నాగ‌శౌర్య‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇందులోని శౌర్య పాత్ర‌ను అలాగే పోషించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ ఎన‌ర్జీతో క‌నిపించాడు. స‌హ‌జ పాత్ర‌లో యుక్తి నటన బాగుంది. ఓ రొమాంటిక్ పాట‌లో గ్లామ‌ర్ తో కుర్రకారును ఊపేసింది. గోప‌రాజు ర‌మ‌ణ‌, ముర‌ళీ శ‌ర్మ, శుభ‌లేఖ సుధాక‌ర్ తమ పాత్ర‌లకు న్యాయం చేశారు. శ‌ర‌త్ కుమార్ పాత్ర క‌నిపించేది కొద్ది సేపైనా ఆకట్టుకుంది. ప్ర‌తినాయ‌కుడిగా షైన్ టామ్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. క‌థ‌లో కామెడీని మిక్స్ చేసి దర్శకుడు పవ‌న్ చ‌క్క‌గా చూపించాడు. అయితే క్లైమాక్స్‌పై ఇంకాస్త శ్రద్ధపెడితే సినిమా ఇంకా బాగుండేది. పవన్ సిహెచ్ సమకూర్చిన స్వరాలు శ్రుతి తప్పాయి. పాట‌లు ఆకట్టుకోలేకపోయాయి. మొత్తంగా చూస్తే
రంగ‌బ‌లి కాల‌క్షేపాన్నిచ్చే సినిమాగా ఉంది.

Related News

Rhea Singha: 19 ఏళ్ల అమ్మాయి, 51 మందితో పోటీ.. చివరికి మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటం, ఇంతకీ తనెవరు?

Devara Movie: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్.. ‘దేవర’ కోసం స్పెషల్ ప్లానింగ్

Aishwarya Rai Bachchan: ఒక్క ఫోటోతో రూమర్స్ కి చెక్.. ఇకనైనా ఆగేనా..?

Upasana Konidela: ఆరోగ్యం విషయంలో మరో ముందడుగు.. హెచ్పీసీఎల్‌తో మెగా కోడలు పార్ట్‌నర్‌షిప్

Star Hero Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో కూతురు..

Rakul Preet : మరో బిజినెస్ లోకి రకుల్ ప్రీత్.. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ..

Hari Hara Veera Mallu: చేసేది ప్యాచ్ వర్క్ మాత్రమే.. పవన్ ఎన్ని రోజులు కేటాయించారంటే.?

Big Stories

×