EPAPER
Kirrak Couples Episode 1

Robotic Technology : వాహనాల తయారీలో ‘హ్యన్స్’ రోబో సాయం..

Robotic Technology : వాహనాల తయారీలో ‘హ్యన్స్’ రోబో సాయం..
Robotic Technology


Robotic Technology : దాదాపు ప్రతీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్.. ఇలాంటి టెక్నాలజీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అన్ని రంగాలలాగానే ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీలను అలవాటు చేసుకుంటోంది. ఇప్పటికే కారు తయారీ విషయంలో ఏఐ సాయం తీసుకుంటున్న పలు సంస్థలు.. ఇప్పుడు ఆ కార్లకు ఉపయోగపడే పార్ట్స్ ప్రొడక్షన్ విషయంలో రోబో సాయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

రోబోటిక్ టెక్నాలజీల ద్వారా వాహనాల తయారీని మెరుగుపరచాలని ‘హాన్స్’ అనే రోబో మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఆటోమొబైల్ రంగంలో వాహనాల తయారీ విషయంలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అందులో ఒకటి వాటర్ ప్రూఫ్ కనెక్టర్స్ టెస్టింగ్. మామూలుగా వాటర్ ప్రూవ్ కనెక్టర్స్‌ను టెస్ట్ చేసే సమయంలో అది ఐపీ 68 పాయింట్‌కు రీచ్ అవ్వాలి. కానీ ఈ టెస్టింగ్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనికి చాలా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.


వాటర్ ప్రూఫ్ కనెక్టర్స్ టెస్టింగ్, ఇలాంటి సమయాన్ని తీసుకునే మరికొన్ని టెస్టింగ్ ప్రక్రియల విషయంలో హ్యాన్స్ ఎల్ఫిన్ లాంటి రోబోలు సాయం చేయనున్నాయి. ఎయిర్ టైట్‌నెస్ టెస్టింగ్ విషయంలో కూడా హ్యాన్స్ సాయంగా ఉండనుంది. దీంతో పాటు ఇతర ఇన్స్‌పెక్షన్స్ విషయంలో కూడా హ్యాన్స్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రొడక్షన్ విషయంలో ఆటోమొబైల్ సంస్థలు మరింత మెరుగుపడనున్నట్టు భావిస్తున్నాయి. 3డీ విజువల్ స్కానింగ్ ఇన్స్‌పెక్షన్, క్యూ ఆర్ కోడ్ మార్కెటింగ్.. ఇలాంటి విషయాలను హ్యాన్స్ పర్యవేక్షించనుంది.

మ్యానువల్‌గా ఇన్స్‌పెక్షన్ చేయడం కంటే హ్యాన్స్ చేసే ఇన్‌స్పెక్షన్ కేవలం 30 సెకండ్లలో పూర్తయిపోతుందని నిపుణులు చెప్తున్నారు. గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ లాంటివి మ్యానువల్‌గా కంటే రోబోటిక్ టెక్నాలజీతో సులభం అని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా వాహనాల తయారీ విషయంలో హ్యాన్స్ లాంటి రోబోలు మరింత మెరుగ్గా పనిచేస్తాయని రోబోటిక్ నిపుణులు అంటున్నారు. ప్రొడక్షన్ క్వాలిటీతో పాటు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో కూడా రోబోటిక్ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో మరింత కీలకంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Big Stories

×