EPAPER

Luan :క్లబ్‌లో ప్లేయర్‌పై దాడి.. స్వల్ప గాయాలు..

Luan :క్లబ్‌లో ప్లేయర్‌పై దాడి.. స్వల్ప గాయాలు..
Luan


Luan : ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరోలన్నా, క్రీడాకారులన్నా చాలా ఇష్టం. ఒక్కొక్కసారి ఆ అభిమానం హద్దులు దాటి.. ఇతరులతో గొడవలు కూడా జరుగుతాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఆ అభిమానం అనేది తాము అభిమానించే మనిషితోనే గొడవ పడేలా చేస్తుంది. తాజాగా ఒక సాకర్ ప్లేయర్ ఫ్యాన్స్ తనతో అలాగే వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా తనపై దాడి కూడా చేశారు. దీంతో ఆ క్రీడాకారుడికి స్పల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

బ్రెజిలియన్ సాకర్ క్లబ్ అయిన కారింథియాన్స్ టీమ్‌కు చెందిన యంగ్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ లియాన్.. తాజాగా ఒక క్లబ్‌లో తన టీమ్‌తో పార్టీ చేసుకున్నాడు. అదే సమయంలో అక్కడికి కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. వారితో ల్యూయాన్‌కు వాగ్వాదం జరిగింది. దీంతో వారు ఆగ్రహంతో ల్యూయాన్‌పై దాడిచేశారు. 2016లో బ్రెజిల్ తరపున ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌కు గెలుచుకున్నాడు ల్యూయాన్. అలాంటి యంగ్ ఆటగాడికి ఇలా జరగడం బాధాకరంగా ఉందంటూ తన కారింథియాన్స్ టీమ్ స్పందించింది. అంతే కాకుండా ఆ క్లబ్ ఓనర్లు కూడా ఈ ఘటనను తీవ్రంగా స్పందించారు.


బ్రెజిలియన్ సాకర్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. ఫ్యాన్స్ వల్ల పలుమార్లు అథ్లెట్స్ ఇబ్బందులు పడ్డారు. అందుకే ల్యూయాన్‌పై జరిగిన దాడి ఘటనపై కారింథియన్స్ ఆగ్రహంతో ఉన్నారు. యంగ్ ఆటగాడిగా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ల్యూయాన్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను తృప్తి పరచలేకపోయింది. దీంతో దాడికి ఇది కూడా ఒక కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు. ల్యూయాన్ మాత్రం ఈ ఘటనపై ఏ విధంగానూ స్పందించలేదు. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాలేదు.

సౌత్ అమెరికా టీమ్‌లో తన సత్తాను చాటుకున్న ల్యూయాన్.. 2020లో సా పాలో క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. అప్పటినుండి తన ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వలేక ఇబ్బందులు పడ్డాడు. ఇక సా పాలో క్లబ్‌తో ల్యూయాన్ చేసుకున్న ఒప్పందం మరో ఆరు నెలల్లో ముగిసిపోనుంది. కారింథియన్స్ తరపున ల్యూయాన్ 80 ఆడలు ఆడగా.. అందులో 11 గోల్స్ చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ లీగ్ టీమ్‌లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాడు ఈ యంగ్ ఆటగాడు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×