EPAPER

Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్‌కు దేశీ వ్యాక్సిన్ తయారీ.. ధర ఎంతంటే..?

Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్‌కు దేశీ వ్యాక్సిన్ తయారీ.. ధర ఎంతంటే..?
Cervical Cancer


Cervical Cancer : ప్రపంచంలో ఎన్నో రకాల క్యాన్సర్లు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్సలు జరిపి పేషెంట్లను బ్రతికించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. కానీ అన్ని చికిత్సల వల్ల పేషెంట్లు బ్రతుకుతారని పూర్తిగా గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక మరికొన్ని క్యాన్సర్లకు చికిత్స అనేది ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. తాజాగా గర్భాశయ క్యాన్సర్‌కు కావాల్సిన వ్యాక్సిన్.. టెస్టింగ్ పూర్తయ్యి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

సెర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్‌కు కావాల్సిన చికిత్స, వ్యాక్సిన్ లాంటివి పలు దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మొదటిసారిగా దీనికోసం ఒక స్వదేశీ వ్యాక్సిన్ తయారయ్యింది. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పరిశోధకులు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉందని వారు తెలిపారు. అంతే కాకుండా ఈ ఏడాది చివరిలోపు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఇది అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.


ప్రస్తుతం గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌కు మార్కెట్లో దాదాపు రూ.2000 వరకు ధర ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇండియాలో కామన్‌గా కనిపిస్తున్న క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రతీ ఏడాది గర్భాశయ క్యాన్సర్ కేసులు 1.23 లక్షలుగా నమోదు కాగా అందులో 77 వేల మంది మరణిస్తున్నారు. అందుకే దీనికోసం హెచ్‌పీవీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసినట్టు ఎస్ఐఐ శాస్త్రవేత్తలు తెలిపారు. ముందుగా గర్భాశయ క్యాన్సర్‌కు గుర్తించడం కోసం హెచ్‌పీవీ టెస్ట్ చేయించుకొని ఆపై క్యాన్సర్ నిర్ధారణ అయితే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉపయోగించాలన్నారు.

ఇప్పటికే ఇతర దేశాల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది. కానీ దానికంటే ఎస్ఐఐ తయారు చేసిన వ్యాక్సిన్ ధర చాలా తక్కువగా ఉందంటూ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం 9 నుండి 26 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మామూలుగా గర్భాశయ క్యాన్సర్‌ గురించి ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ క్యాన్సర్ బయటపడిన తర్వాత హ్యామన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో పనిచేసి పేషెంట్లను బ్రతికించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×