EPAPER

Vintage Car :వింటేజ్ కారును విరాళంగా ఇచ్చిన వారసుడు..

Vintage Car :వింటేజ్ కారును విరాళంగా ఇచ్చిన వారసుడు..
Vintage Car


Vintage Car : ప్రస్తుతం కార్ల విషయంలో కస్టమర్ల టేస్ట్ మారుతూ వస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. అందుకే దిగ్గజ కారు కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో బిజీగా ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లు మాత్రమే కాదు.. వింటేజ్ కార్లంటే కూడా చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అందుకే కోట్లు పెట్టి కొనడానికి కూడా వెనకాడరు. అలాంటి ఒక వింటేజ్ కారు ఆబర్న్ ఆటోమొబైల్ మ్యూజియంకు విరాళంగా వెళ్లింది.

ఆబర్న్ కార్డ్ డ్యూసెన్‌బర్గ్ ఆటోమొబైల్ మ్యూజియం కలెక్షన్‌లో అరుదైన 1966 కార్డ్ 8/10 మోడల్ చేరింది. దీనిని మార్టిన్ జె గాల్లెఘర్ III నుండి విరాళంగా పొందినట్టు మ్యూజియం యాజమాన్యం చెప్తోంది. మార్టిన్ గాల్లెఘర్ III తండ్రి మార్టిన్ గాల్లెఘర్ II ఈ కారును 1972లో కొన్నట్టుగా వారు చెప్తున్నారు. ఈ కారును కొన్న తర్వాత గాల్లెఘర్ II.. దీనిని మెయింటేయిన్ చేసే విషయంలో ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. కానీ ఆ వ్యక్తి కారును దొంగలించి పారిపోయాడు.


దొంగలించబడిన కారు కోసం గాల్లెఘర్ II పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఎన్ని సంవత్సరాలు వెతికినా కారు జాడ తెలియలేదు. దీంతో తన కొడుకు గాల్లెఘర్ III.. కారును కనిపెట్టే విషయంలో రంగంలోకి దిగాడు. 15 ప్రభుత్వ ఏజెన్సీలు, 22 రాష్ట్రాలను కాంటాక్ట్ చేశాడు. అలా చాలాకాలం వెతికిన తర్వాత వర్జీనియాలో కారును కనిపెట్టగలిగాడు గాల్లెఘర్ III. ఆ కారు ప్రత్యేకత ఏంటో తెలియని వ్యక్తి దగ్గర కారు ఉందని గాల్లెఘర్ III అన్నాడు.

చివరిగా 1997లో ఎంతో పోరాడిన తర్వాత ఈ వింటేజ్ కారు లీగర్ ఓనర్‌షిప్ అనేది గాల్లెఘర్ III చేతికి వచ్చింది. అప్పటికే తన తండ్రి మరణించడంతో తన తండ్రి గుర్తుగా ఈ కారును ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇంతకాలం తర్వాత తన తండ్రి గుర్తుగా ఈ కారు ఆబర్న్ ఆటోమొబైల్ మ్యూజియంలో ఉండాలని నిర్ణయించుకున్న గాల్లెఘర్ III దీనిని విరాళంగా అందించాడు. ఇలాంటి కారు తమ కలెక్షన్‌లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామంటూ మ్యూజియం యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×