EPAPER

Octopus: మనుషుల్లో, ఆక్టోపస్‌లలో ఆసక్తికరమైన పోలిక..

Octopus: మనుషుల్లో, ఆక్టోపస్‌లలో ఆసక్తికరమైన పోలిక..

Octopus: సాధారణంగా మనిషి అనేవాడు కోతి నుండి పుట్టాడని అంటుంటారు. అందుకే కోతికి, మనిషికి చాలా దగ్గర పోలికలు ఉంటాయంటారు. కేవలం కోతి మాత్రమే కాదు మరెన్నో ఇతర జంతువులకు కూడా మనుషులతో దగ్గర పోలికలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంలో వారికి ఎన్నో ఉదాహరణలు కూడా దొరికాయి. తాజాగా ఆక్టోపస్‌లకు, మనుషులకు కూడా ఒక దగ్గర పోలికను కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


ఆక్టోపస్‌లకు ఎనిమిది తొండాలు ఉంటాయన్నది తెలిసిన విషయమే. తాజాగా అవి పడుకునే విధానాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరీక్షించారు. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఆక్టోపస్ బ్రెయిన్ యాక్టివిటీని వారు స్టడీ చేశారు. పడుకున్నప్పుడు వాటి స్కిన్ ప్యాటర్నింగ్ ఎలా ఉందో.. మేలుకొని ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నట్టు వారు గుర్తించారు. కొన్ని జంతువుల్లో ఇలా జరుగుతుంటుందని తెలిపారు. అయితే ఆక్టోపస్ నిద్రకు, మనిషి నిద్రకు పోలికలు ఉన్నట్టుగా బయటపెట్టారు. ఈ పోలికను మరింత ఎక్కువగా పరిశోధిస్తే.. నిద్ర గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.

మనిషి కూడా పడుకున్నట్టే ఉన్న మెదడులో ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ఆక్టోపస్‌లలో కూడా అచ్చం అలాగే జరుగుతోంది. అందుకే నిద్ర గురించి, నిద్ర సమయంలో బ్రెయిన్ యాక్టివిటీ గురించి, నిద్ర సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవడానికి ఈ లీడ్ కచ్చితంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒక్కసారి ఆక్టోపస్‌లు యాక్టివ్ స్లీప్‌లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే.. కొంతకాలం తర్వాత అవి ఎక్కువగా నిద్రపోతుంటాయని వారు గమనించారు. అంటే వాటి యాక్టివ్ స్లీప్‌ను డిస్టర్బ్ చేయడం ద్వారా కొన్నిరోజులకు వాటికి నిద్ర సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయని కనిపెట్టారు. ఇదే విధంగా మనుషులకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.


మనుషులు ఎలా అయితే నిద్రలో నుండి లేచిన తర్వాత వారికి వచ్చిన కలను గుర్తుపెట్టుకుంటారో.. ఆక్టోపస్‌లు కూడా అలాగే వాటి కలను గుర్తుపెట్టుకుంటాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇలా ఆక్టోపస్ నిద్రలో, మనిషి నిద్రలో పలు పోలికలను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. ముందు ముందు మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయని ఆశిస్తున్నారు. దీని ద్వారా మనుషుల నిద్ర సంబంధిత వ్యాధులకు పరిష్కారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×