EPAPER

Mega Princess: మెగా ప్రిన్సెస్ నామకరణం.. అంబానీ స్పెషల్ గిఫ్ట్..

Mega Princess: మెగా ప్రిన్సెస్ నామకరణం.. అంబానీ స్పెషల్ గిఫ్ట్..

Mega Princess: రామ్ చరణ్, ఉపాసన.. ఇన్నాళ్లుగా టాలీవుడ్‌లో పవర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి పెళ్లి అయ్యి పదేళ్లు అయినా ఇంకా వారసులు లేరని ప్రశ్నలు వీరికి ఎదురయ్యేవి . ఉపాసన ఒక కుమార్తెకు జన్మనిచ్చి మెగా ఫ్యామిలీలోకి మెగా ప్రిన్సెస్‌ను ఆహ్వానించింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన కుటుంబాలు ఎంతో సంతోషంలో ఉన్నాయి. తాజాగా ఈ మెగా ప్రిన్సెస్ నామకరణం ఘనంగా జరిగింది.


మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు పాప ఫేస్‌ను రివీల్ చేయకపోయినా.. తనకు సంబంధించిన అప్డేట్స్‌ను మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు రామ్ చరణ్. తాజాగా తన నామకరణ విషయాన్ని కూడా స్వయంగా పోస్ట్ చేశాడు మెగా పవర్ స్టార్. పాప పేరు ‘క్లిన్ కారా కొణిదెల’ అని రివీల్ కూడా చేశాడు. సమీప బంధువులతో, కుటుంబ సభ్యులతో క్లిన్ కారా నామకరణ వేడుక ఘనంగా జరిగింది.

క్లిన్ కారా కోసం ముఖేష్ అంబానీ దంపతులు బంగారు ఉయ్యాలను కానుకగా ఇచ్చారట. పూర్తిగా బంగారంతో తయారు చేసిన ఈ ఉయ్యాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి కుటుంబానికి, అంబానీ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అంబానీ స్పెషల్‌గా మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కోసం ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ పంపించాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


అయితే, అంబానీ కుటుంబం బంగారు ఉయ్యాల ఇచ్చినట్టు వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. ప్రజ్వల ఫౌండేషన్ వారు చేతితో తయారు చేసిన చెక్క ఉయ్యాలను బహుమతిగా ఇచ్చారని.. దానినే వాడుతున్నట్టు తెలిపారు.

Related News

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Big Stories

×