EPAPER

Tree Shadow: ఈ చెట్ల నీడ ఇంటిపై అసలు పడకూడదా….?

Tree Shadow: ఈ చెట్ల నీడ ఇంటిపై అసలు పడకూడదా….?

Tree Shadow: భూమి మీద మనిషికి చెట్టుకి విడదీయరాని బంధం ఉంది.. చెట్టు లేనిదే మనిషి లేడు. చెట్ల నుంచి వచ్చే గాలితో మనిషి బతకడానికి అవసరమైన ప్రాణాధారం దొరుకుతుంది. హిందూమతంలో ప్రత్యేకించి చెట్టు పుట్టా అన్నింటిని దైవ స్వరూపంగా భావించాలని చెబుతోంది. అందుకే కొన్ని చెట్లను ఇంట్లో పెంచుకోవడం,వాటిని పూజించడం చేస్తుంటాం. చెట్ల వల్ల మనకి గాలితోపాటు నీడ దొరుకుతుంది.
అయినా కానీ కొన్ని రకాల చెట్ల నీడలు మాత్రం మన ఇంటిపై అసలు పడకూడదంటారు జ్యోతిష్య పండితులు.


తుమ్మ చెట్టు
తుమ్మచెట్టు లాంటివి ఇంటి ఆవరణలో పెరిగితే మాత్రం వెంటనే తీసేయాలి. లేకపోతే ఆ చెట్టుకున్న ముల్లులు లాగా ఇంట్లో ఉన్న వారిని నిత్యం ఏదో బాధలు అనుభవిస్తూ ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు

మునగ చెట్టు
మునగ చెట్టు వల్ల ఎన్నో లాభాలున్నాయి. మునగాకుతో ఎన్నో ఆరోగ్య సమస్యలకి మందుగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇంత మంచి చేస్తున్న ఈ చెట్టును ఇంటి ఆవరణలో మాత్రం పెంచకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ చెట్టు నీడ తగిలితే సంతాన సమస్యలు వస్తాయంటోంది. కాబట్ట ఈ చెట్టును ఇంట్లో పెంచకూడదు.


రావి చెట్టు
హిందూ మతంలో రావి చెట్టుకు విశేష ప్రాధాన్యం ఇస్తారు. ఉపనయనాల సమయంలో రావి కొమ్మను ఉపయోగిస్తుంటారు. రావిచెట్టుకి పూజ చేస్తే సంతాన సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అసలు పడకూడదంటారు. ఇంటిపై ఈ వృక్షం నీడపడితే ఇంట్లోని ఉన్న వారికి ఆర్ధిక సమస్యలు పెరుగుతాయంటారు.

చింత చెట్టు..
ముళ్లు ఉన్న చెట్లను ఇంట్లో పెంచకూడదని శాస్త్రం చెబుతోంది. చింత చెట్టు వేళ్లు బలంగా ఉంటాయి. చింత చెట్టు నుంచి గాలి వేడిగా వీస్తుంది. ఈ గాలిని పీల్చితే ఆరోగ్య సమస్యలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇంటి ఆవరణలో చింత చెట్టు పెంచుకూడదంటారు.. చింత చెట్టు నీడ ఇంటిపై పడితే కుటుంబ సభ్యుల గొడవలు జరుగుతాయట. కుటుంబ సభ్యులకి మానసిక ప్రశాంతత కరువై ఇబ్బందులు పడతారట.

Related News

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Big Stories

×