EPAPER
Kirrak Couples Episode 1

Spy Movie Review : నిఖిల్ మళ్లీ పాన్ ఇండియా హిట్ కొట్టాడా..? స్పై మూవీ ఎలా ఉందంటే..?

Spy Movie Review : నిఖిల్  మళ్లీ పాన్ ఇండియా హిట్ కొట్టాడా..? స్పై  మూవీ ఎలా ఉందంటే..?

Spy Movie Review Telugu(Today tollywood news): నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ‌2’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ హీరో ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకునేందుకు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే క‌థ‌ను ఎంచుకుని ‘స్పై’ సినిమాలో నటించాడు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం వెనుక ర‌హ‌స్యం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా విడుదలైన స్పై మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా..? నిఖిల్ మళ్లీ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడా..? ట్రైలర్ లో ఉన్న ఉత్కంఠ సినిమాలో ఉందా..? ఆ విషయాలు తెలుసుకుందాం.


కథ : జైవ‌ర్ధ‌న్ (నిఖిల్) రా ఏజెంట్‌ గా శ్రీలంక‌లో ప‌నిచేస్తుంటాడు. భార‌త్ పై దాడి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఉగ్ర‌వాది ఖదీర్ ఖాన్ చ‌నిపోయాడ‌ని అందరూ అనుకుంటారు. ఖ‌దీర్ కోసం స్పెషల్ మిష‌న్‌తో జై రంగంలోకి దిగుతాడు. మ‌రి ఖ‌దీర్ దొరికాడా? చ‌నిపోయాడా? జై త‌న అన్న సుభాష్ (ఆర్య‌న్ రాజేశ్‌)ను హత్య చేసిన వారిని ఎలా క‌నిపెట్టాడు? ఈ మిష‌న్‌కు ఆజాద్ హింద్ ఫౌజ్ ద‌ళ‌ప‌తి నేతాజీ అదృశ్యం వెనకున్న మిస్టరీకి సంబంధం ఏమిటనేది మిగ‌తా క‌థ‌.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంశం స్పై సినిమాపై ఆస‌క్తిని పెంచింది. ఇలాంటి గూఢ‌చారి క‌థ‌లో ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు బ‌లంగా ఉండాలి. కానీ దేశానికి ముప్పుగా మారిన క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదిని మ‌ట్టుబెట్టేందుకు హీరో ఓ మిష‌న్‌ చేపట్టడం అనేది చాలా సినిమాల మాదిరిగానే ఓ ఫార్ములాతో ఫస్టాఫ్ సాగింది. కథనం ప్రేక్షకుల్లో ఆస‌క్తిని మాత్రం పెంచలేదు.


సెకండాఫ్ లోనూ మేజిక్ కనిపించలేదు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఫైల్ చుట్టూ సాగే కొన్ని స‌న్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆయ‌న పోరాట స్ఫూర్తి నేప‌థ్యం ఆసక్తిని రేకెత్తించింది. కానీ మిగతా సినిమా అదే స్థాయిలో సాగకపోవడం మైనస్ పాయింట్. రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం, పోరాట ఘ‌ట్టాలతో చాలా హంగామా తెర‌పై క‌నిపించింది. కానీ ఎక్క‌డా ప్రేక్ష‌కుడికి ఉత్కంఠకు గురిచేయలేకపోయింది. క‌థానాయ‌కుడి సోద‌రుడి మ‌ర‌ణం వెన‌క ర‌హ‌స్యం, నేతాజీ ఫైల్.. ఇలా క‌థ‌లో మిస్టరీని ప్రేక్ష‌కులకు థ్రిల్‌ కలిగించేలా చూపించడంలో ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడు.

నిఖిల్‌ పోరాట ఘ‌ట్టాల కోసం బాగా శ్ర‌మించాడు. హీరోయిన్లు ఐశ్వ‌ర్య మేన‌న్‌, సానియా గ్లామర్ తోపాటు యాక్టింగ్ లోనూ ఆకట్టుకున్నారు. ఆర్య‌న్ రాజేశ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌చిన్ ఖేడేక‌ర్ లాంటి కీలక నటులు ఉన్నా వారి పాత్ర‌లు అంత ప్రభావం చూపించలేదు. రా అధికారిగా మ‌క‌రంద్ దేశ్‌పాండే న‌ట‌న‌ ఆకట్టుకోలేదు. నితిన్ మెహ‌తా, జిష్షూసేన్ గుప్తా పోషించిన విలన్ పాత్ర‌లు బ‌లంగా లేవు.రానా అతిథి పాత్రలో మెరిశాడు. మొత్తంమీద స్పై మూవీ అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి.

చిత్రం : స్పై
యాక్టర్స్ : నిఖిల్‌, ఐశ్వర్య మేనన్‌, మకరంద్‌ దేశ్‌ పాండే,
ఆర్యన్‌ రాజేశ్‌,రానా , జీసు సేన్‌గుప్తా, అభినవ్‌, నితిన్‌ మెహ్తా.
స్టోరీ : కె.రాజశేఖర్‌ రెడ్డి
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌
మ్యూజిక్ : శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ : ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత : కె.రాజశేఖర్‌ రెడ్డి
డైరెక్టర్ : గ్యారీ బీహెచ్‌
విడుదల : 29-06-2023

Tags

Related News

Jani Master : ఆ మూవీ షూటింగ్ లో ఆమెను దారుణంగా కొట్టిన జానీ.. బయటపడ్డ మరో నిజం..

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Devara Movie First Review : దేవర ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా…

Samantha: సమంత ఇంట పెళ్లి సందడి..

Deavara Release Trailer: ఇప్పుడు అందరి ఆశలు ఈ ట్రైలర్ పైనే.. ఇది కనుక క్లిక్ అయితే..

Big Stories

×