EPAPER
Kirrak Couples Episode 1

Varahi Navratri :వారాహి నవరాత్రి దీక్ష చేసే వారు ఈ ఆహారం తినకూడదా….

Varahi Navratri :వారాహి నవరాత్రి దీక్ష చేసే వారు ఈ ఆహారం తినకూడదా….


Varahi Navratri : వారాహి నవరాత్రి దీక్షలు చేసే వారి కొన్ని ఆహార నియమాలు పాటించాలంటోంది శాస్త్రం. 9 రోజలు పాటు ఊదయం , సాయంత్రం రెండు పూటలా చేయడంతో బ్రహ్మచర్యం పాటించాలి. దీక్షలో కూర్చున్న పదిరోజులు మాంసానికి దూరంగా ఉండాలి. వెజిటేరిన్ పుడ్ మాత్రమే వండాలి తీసుకోవాలి. ఏ పదార్ధాన్ని వండినా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ప్రసాదంగా భుజించాలి. వీలైతే పది రోజులుపాటు అఖండ దీపం పెట్టుకుంటే మంచిది. వారాహి పూజ ఇంట్లో ఆడవారు, మగవారు కూడా నిర్వహించ వచ్చని అంటోంది శాస్త్రం.

వారాహి పాడి పంటలకు ,భూమికి సంబంధించిన పూజ కార్యక్రమం. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయాలి. ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగ్గా పదో రోజుకి మొలకలు బాగా మొలిస్తే మీ సంకల్పం నెరవేరినట్టు.. తర్వాత అవి అవుకి తినిపించాలి .


పసుపు గణపతిని ప్రతి రోజూ చేయాలి..ఆ గణపతి ని చేసిన పసుపు వాడుకోవాలి.

విగ్రహం ఉంటే రోజూ పసుపు జలంతో అభిషేకం చేయడం మంచిది. ఒక వేళ ఫోటో మాత్రమే ఉంటే రోజూ పువ్వులు వాడుకోవచ్చు.

విగ్రహం కానీ, ఫోటో కానీ లేని వారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేసుకోవచ్చు. యంత్ర పూజా విధానం తెలిసిన వారు మాత్రమే యంత్ర పూజను ప్రతీ రోజు ఆచరించాలి.

మధ్యాహ్నం భోజనం చేయవచ్చు సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేయాలి.

మీ శక్తి మేరకి నైవేద్యం పెట్టండి. అమ్మవారికి ప్రతీ రోజు బెల్లం పానకం పెట్టడం మంచిది. అమ్మవారికి బెల్లం పానకం అంటే ప్రీతి.

కోరికలతో పూజ చేసే వారు నవరాత్రులు నియమాలు పాటించాలి. పద్దతిగా ఉండాలి. వారాహి పూజలో ఉన్నప్పుడు ఎప్పుడూ నోటి నుంచి చెడు మాటలు రాకూడదు. వేరే మహిళలు, పురుషుల గురించి చెడు మాటలు రాకూడదు . చెడు ఆలోచనలో పూజలు పనికిరావనే సంగతి గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చి దీక్ష మధ్యలో ఊరు వెళ్లాల్లి వస్తే ఆరోజు అమ్మకి పూజ చేసి సమస్య చెప్పి దండం పెట్టుకోవాలి. అమ్మవారికి చేసే పూజ ఏకాగ్రతతో మనస్సు పెట్టి చేస్తే ఫలితాలు కళ్లారా చూడవచ్చని శాస్త్రం చెబుతోంది.

Tags

Related News

Shukra Gochar 2024: అక్టోబర్ 13 వరకు వీరికి తిరుగులేదు

Weekly Horoscope (22-28): సెప్టెంబర్ 22- 28 వరకు వారఫలాలు

Surya Grahan 2024 Negative Effect: సూర్య గ్రహణం కారణంగా 5 రాశుల వారికి అనేక ఇబ్బందులు

Weekly Lucky Zodiac Sign: సెప్టెంబరు చివరి వారంలో ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Big Stories

×