EPAPER

Pawan Kalyan: ఎస్సైని కొట్టిన జగన్.. పవన్ సంచలనం.. అతనో విప్లవకారుడా?

Pawan Kalyan: ఎస్సైని కొట్టిన జగన్.. పవన్ సంచలనం.. అతనో విప్లవకారుడా?
PAWAN KALYAN JAGAN

Pawan Kalyan latest political news(AP breaking news today): వారాహి యాత్రతో వైసీపీ పంబ రేగ్గొడుతున్నారు పవన్ కల్యాణ్. గోదావరి జిల్లాల్లో తిరుగుతూ.. ఊరూరా జగన్ అరాచకాలను ఎండగడుతున్నారు. లేటెస్ట్‌గా నరసాపురం సభలో జగన్ గురించి మరో ఆసక్తికర విషయం చెప్పారు.


ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్స్ ట్రైనింగ్ లేక యువత మంచి భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మీ వయసులో ఉన్నప్పుడు జగన్ ఏం చేసేవాడో తెలుసా? అంటూ ఫ్లాష్ బ్యాక్ వివరించారు.

జగన్‌కు 19-21 ఏళ్ల వయసుల్లో.. తండ్రి ఎమ్మెల్యే అని విర్రవీగుతూ.. జూబ్లీహిల్స్, కడపలో దౌర్జన్యాలు చేసేవాడని చెప్పారు. పులివెందులలో ఓ ఎస్సైని పోలీస్ స్టేషన్లోనే కొట్టాడని అన్నారు. అలాంటి రౌడీ నాయకుడిని గెలిపిస్తే.. అరాచకాలు చేయక ఇంకేం చేస్తాడని మండిపడ్డారు. వైసీపీ నేతలంతా అలానే తయారయ్యారని.. గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి కొడుకు.. డీఎస్పీని కొట్టాడని చెప్పారు. పులివెందుల రౌడీయిజాన్ని కోనసీమకు తీసుకొస్తే ఊరుకునేది లేదని.. ఉరికించి కొడతామని హెచ్చరించారు జనసేనాని.


జగన్ గురించి పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. వైఎస్సార్ ఉన్నరోజుల్లో జగన్ దూకుడుగా ఉండేవారని అంటారు. హీరో బాలయ్యకు వీరాభిమాని అనికూడా చెబుతారు. అప్పట్లో ఓ కాంగ్రెస్ కార్యకర్తను స్థానిక ఎస్సై అరెస్ట్ చేస్తే.. ఆ విషయం తెలిసి జగన్ కోపంతో ఊగిపోతూ స్టేషన్‌కు వెళ్లాడని.. అక్కడ ఉన్న ఎస్సైని కొట్టాడని అంటుంటారు. జగన్ రౌడీయిజం, ఎస్సైని కొట్టడం గురించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఓ కమ్యూనిస్టు సానుభూతిపరుడు ప్రశ్నిస్తే.. ఏం చేద్దాం.. మా అబ్బాయి జగన్‌ కూడా మీలా ఓ విప్లవకారుడే అన్నారట. వైఎస్సార్ ఆన్సర్ విని ఆ కామ్రేడ్ అవాక్కయ్యారట. ఈ విషయం ఆ పెద్దాయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఎస్సైను కొట్టిన మేటర్ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారని అంటున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×