EPAPER

TDP : వ్యూహం టీజర్ పై టీడీపీ మౌనం.. ఎందుకంటే..?

TDP : వ్యూహం టీజర్ పై టీడీపీ మౌనం.. ఎందుకంటే..?

TDP : రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాను వైసీపీకి అనుకూలంగా వర్మ తీస్తున్నారు. టీజర్ లోనే ఈ విషయం స్పష్టంగా చెప్పారు. జగన్ పాత్రను హీరోగా ఎలివేట్ చేశారు. వైఎస్ ఫ్యామిలీ భావోద్వేగాలను చూపించారు.


ఈ టీజర్ లో ఒక్క డైలాగే ఉన్నా అది కూడా చంద్రబాబును ఉద్దేశించి జగన్ పాత్ర చెప్పడం ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు పాత్ర హావభావాల్లో విలనిజం చూపించారు. దీంతో వ్యూహం మూవీపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారనే చర్చ మొదలైంది. అయితే ఈ మూవీ టీజర్ ను తెలుగుదేశం పార్టీ లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

వ్యూహం మూవీ గురించి చర్చించాల్సి పనిలేదని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి పార్టీకి వ్యతిరేకంగా వర్మ సినిమా తీస్తున్నారని టీడీపీ పెద్దలు అంటున్నారు. ఇప్పుడు కూడా మరో మూవీని తీసుకొస్తున్నారని చెబుతున్నారు. వ్యూహం సినిమా గురించి పట్టించుకోవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.


వ్యూహం టీజర్ తో టీడీపీ కంటే వైసీపీకి నష్టమని టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీని ఆర్జీవి రెండు ముక్కలు చేసినట్టు టీజర్ లో కనిప్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్ఆర్ ఫ్యామిలీ, అభిమానులు చూసుకుంటారని తమకి అవసరం లేదని టీడీపీ భావిస్తోందని సమాచారం.

వర్మ కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన సినిమాపై అంచనాలు పెంచుతారు. గతంలోనూ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని విడుదల చేసి వర్మ వివాదాన్ని సృష్టించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు వర్మపై ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పాత్రను చూపించిన విధానాన్ని తప్పుపట్టారు. కానీ గతంలో మాదిరిగా కాకుండా టీడీపీ ఈసారి వ్యూహం మూవీపై వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×