EPAPER
Kirrak Couples Episode 1

Bhanu Saptami : భాను సప్తమి ఈ రోజు పనిచేస్తే చాలు…

Bhanu Saptami : భాను సప్తమి ఈ రోజు పనిచేస్తే చాలు…
Bhanu Saptami


Bhanu Saptami : వారాహి గుప్త నవరాత్రుల్లో ఏడో రోజు భాను సప్తమి తిథి వస్తోంది. ఈరోజు కొన్నివేల గ్రహణాలు వస్తే ఎంత శుభయోగమో అంత మంచి రోజు భాను సప్తమి. కుదిరితే ఈరోజు సముద్ర స్నానం, లేదా నదీస్నానం చేయాలి. మనం చేసే పాపాలు వ్యాధుల రూపంలో పీడిస్తాయంటారు. ఎలాంటి దోషాలున్నాయని సరే సాగర స్నానం ఆచరించి సూర్యనమస్కారం చేస్తే ఫలితాలు కలుగుతాయి. ఇవాళ పూజ చేయడం చేయగలిగితే మంచం మీదఉండి చనిపోతాడనుకున్న వ్యక్తి కూడా మరో పది రోజులు జీవించే శక్తిని ప్రసాదిస్తాడు. భానుసప్తమి రోజే వ్యతిపాత యోగం కూడా రావడం విశేషమైన రోజుగా చెబుతారు.
ఇలాంటి యోగం ఉన్న రోజులు చాలా వచ్చినా సప్తమి, ఆదివారం, ఫాల్గుణి నక్షత్రంలో వ్యతిపాత యోగం కూడా కలిసి రావడం శుభఫలితాలను కలిగిస్తుంది.

రాశుల, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఎవరైనా సప్తమి తిథినాడు సూర్యుడ్ని పూజించాలి. గంధం చెక్కను తీసుకుని అరగదీసి నీళ్లలో కలిపి నువ్వులు వేసి గరికను పెట్టి దోసిళ్లలో పోసుకుని మంత్రాన్ని జపిస్తూ 12మంది సముద్రం లేదా నదిలో వదిలిపెట్టమని శాస్త్రం చెబుతోంది.
ఇలా పన్నెండు రోజు చేస్తే ఊహించని ఫలితాలను కళ్లారూ చూడవచ్చంటున్నారు పెద్దలు. జీవితంలో టర్నింగ్ పాయింట్ కావాలనే వారు ఈ పని చేస్తే చాలని చెబుతున్నారు.


ఉదయమే లేచి తలస్నానం చేసి ఎర్రబట్టలు వేసుకోవాలి. సూర్యునికి నమస్కారం చేసి ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టి పువ్వులతో బాగా అలంకరణ చేసుకోవాలి. ఇంటి ముగ్గు వేసి సూర్యుడికి ఇష్టమైన చిక్కుడుకాయను పెట్టడం వల్ల సూర్యానుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అలాగే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించాలి. సూర్యుడ్ని ఆరాధించడం వల్ల మీకుఅన్నింటా శుభం కలుగుతుంది. భానుసప్తమ పూజ వల్ల ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని సప్తమి రోజు సూర్యాదనతో పొందవచ్చు. ఓం నమో ఆదిత్యాయ నమః” అనే మంత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు ఆరోగ్యాన్న ప్రసాదిస్తాడని ప్రతీతి. ఈ నియమాలు కేవలం భానుసప్తమికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించాలి.

Tags

Related News

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Big Stories

×