EPAPER
Kirrak Couples Episode 1

Tirumala : తిరుమలలో ఆకర్షణా యంత్రం వల్లే భక్తుల సంఖ్య పెరుగుతోందా?

Tirumala : తిరుమలలో ఆకర్షణా యంత్రం వల్లే భక్తుల సంఖ్య పెరుగుతోందా?

Tirumala: తిరుమలకి ఏటేటా వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తుల గంటల కొద్దీ ఉండానికి కూడా ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. కారణం శ్రీవారిపై భక్తి మాత్రమే . దేశంలో చాలా ఆలయాలు ఉన్నా ఎక్కువమంది భక్తులు దర్శించే క్షేత్రం తిరుమలనే. శ్రీవారి మూలవిరాట్టును చూస్తూ గంటల కొద్దీ నిలబడటానికి భక్తుల సదా సిద్దంగా ఉంటారు. కానీ రెప్పపాటులోనే శ్రీవారి దర్శనం చేసుకుని బయటకి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. తిరుమల వెళ్లిన వారు వీలైతే మూడు, నాలుగు దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అంతగా భక్తుల్ని శ్రీవారి మూలవిరాట్టు ఆకట్టుకుంటోంది,


మూలవిరాట్టులోని ఆకర్షణా శక్తి వల్లే శ్రీవారిని భక్తులు తిరుమలకి వస్తుంటారని అంటారు. గతంలో ముస్లిం రాజులు దేశంలోని ప్రధాన ఆలయాలపై దాడులు చేసి ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలపైకూడా దండయాత్రలు చేశారు. బ్రిటీష్ వాళ్లు కూడా హిందూ సంస్కృతిపైనే దేవాలయాపైన దాడులు చేశారు. కానీ ఎవరూ తిరుమల ఆలయం జోలికి మాత్రం రాలేదు. తిరుమల ఆలయానికి రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందంటోంది శాస్త్రం. తిరుమలలోని శిలా తోరణం వయసు సుమారు 150 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్దారించారు.

స్వామి కొండపైకి వచ్చిన ముహూర్తం కన్యారాశిలో శ్రవణా నక్షత్రంలో జరిగింది. అది విజయదశమి సమయంలో జరిగింది. స్వామి అడుగుపెట్టినప్పుడు బ్రహ్మ చేసిన మొదటి సేవ కాబట్టే బ్రహ్మోత్సవం గా స్థిరపడింది. బ్రహ్మ వెలిగించిన దీపాన్ని చూసిన స్వామి వారు ఈ దీపం వెలుగుతున్నంత సేపు ఇక్కడే ఉంటానని అది ఆరిపోతే మాత్రం వైకుంఠానికి తిరిగి వెళ్లిపోతానని చెప్పారట. ఆ తర్వాత ఆనంద నిలయం కూడా మాయం అవుతుందని చెప్పారట. ఇంత విశిష్టత ఉన్న మూలవిరాట్టు కాబట్టే భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.


Related News

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Big Stories

×