EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan: పవనే సీఎం.. సర్వే ఫలితాల్లో సంచలనం..

Pawan Kalyan: పవనే సీఎం.. సర్వే ఫలితాల్లో సంచలనం..
cm pawan-kalyan

Pawan Kalyan: సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందా? పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్లినా జనసేనాని ముఖ్యమంత్రి అవుతారా? కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మాత్రం అవునంటున్నారు. తమ సంస్థ తరఫున గోదావరి జిల్లాల్లో సర్వే చేశామంటూ ఆ రిపోర్ట్ బయటపెట్టారాయన.


ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్స్ సేకరించామని.. కులాలవారీగా అభిప్రాయం తెలుసుకున్నామని చెప్తున్నారు. ఆ సర్వేరిపోర్టు ప్రకారం.. జనసేనకు 80శాతం మంది కాపులు మద్దతిస్తున్నారు. టీడీపీ-8, వైసీపీ-12 శాతం కాపుల మద్దతు పొందుతున్నాయి.

బీసీ ఓట్లు విషయానికి వస్తే.. జనసేనకు 25శాతం సపోర్ట్ ఇస్తుండగా.. టీడీపీకి 40 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. మిగతా 35 శాతం మంది అధికార వైసీపీకి అండగా ఉంటున్నారు.


ఎస్సీ ఓట్లు.. జనసేన-26, టీడీపీ-14 శాతం పడనుండగా.. వైసీపీకి 60 శాతం మంది మద్దతుగా నిలుస్తున్నట్టు హరిరామ జోగయ్య చేయించిన సర్వేలో తేలింది.

ఈ లెక్కన పవన్‌కు ఫుల్ సపోర్టు ఉందని హరిరామ జోగయ్య మాట. వారాహి యాత్ర పూర్తయ్యి.. పవన్ పథకాలు పూర్తిస్థాయిలో తెలిస్తే.. మరింత మద్దతు పొందగలరని ఆయన అంటున్నారు.

తాను సీఎం అవుతానంటూ, అందుకు అన్ని అర్హతలు సాధించానంటూ పిఠాపురం సభలో పవన్ చేసిన ప్రకటన ప్రజల్లో ఫుల్ జోష్ నింపిందని కూడా జోగయ్య అంటున్నారు.

Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×