EPAPER

Vastu Tips For Home : ఇంటికి ఎలాంటి తోరణం కట్టుకోవాలి

Vastu Tips For Home : ఇంటికి ఎలాంటి తోరణం కట్టుకోవాలి

Vastu Tips For Home : ఇల్లు నిత్యం సంతోషాలతో ఉండాలంటే గుమ్మానికి పచ్చ తోరణం కడితే మంచిదంటారు. కానీ నిత్యం గుమ్మానికి పచ్చ తోరణం కట్టడం కష్టం . అందులోనూ ఈ రోజుల్లో మరీ కష్టం. ఏదో పండుగో పబ్బమో వచ్చినప్పుడు పచ్చని మామిడి ఆకులతో గుమ్మానికి తోరణాలు కడుతుంటాం. మరి మిగిలిన రోజుల్లో ఎలా…? మామిడి ఆకులతో కట్టిన తోరణాలు ఎండిపోతే గుమ్మం చూడబుద్ది కాదు. ఎండిపోయిన ఆకులతో గుమ్మం ఉండకూడదు. అందుకే కొంతమంది గుమ్మానికి ధాన్యం తోరణం కడుతుంటారు. శ్రీ మహాలక్ష్మీకి ఇష్టమైన తోరణం కూడా ఇదేనంటారు. అందుకే ధాన్య లక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. లక్ష్మీ ప్రదంగా కనిపిస్తుంది.


ధాన్యం తోరణం ఉన్న ఇంటికి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇంటి ప్లాస్టిక్ తోరణాలు పెడుతుంటారు. కానీ వాటి కంటే ధాన్యపు తోరణం ఉత్తమం. ఇలాంటి తోరణాలు కొనడం వల్ల రైతు కుటుంబానికి మేలు చేసిన వాళ్లమవుతాం. రైతులకి పరోక్షంగా సహాయ పడిన వాళ్లు అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది . ఆ పుణ్యం కూడా మనకి కలుగుతుంది.

ఇంటి గుమ్మం ముందు వాస్తు హనుమాన్ ఫోటో పెట్టుకుంటే మంచిదని శాస్త్రం సూచిస్తోంది . ఈ పటాన్ని పెట్టుకోవడం వల్ల ఇంటికి ఏదైనా వాస్తు దోషం తొలగిపోతుంది. దుష్టశక్తులు ఇంటి దరిదాపుల్లోకి ప్రవేశించవంటారు. ఆంజనేయుడు సింహద్వారంపైన ఉండటం సర్వవిధాలా శుభప్రదంగా భావిస్తుంటారు. వాస్తును నమ్మాలి. కానీ వాస్తే జీవితం కాదు. ఇంట్లో ఏవైనా వాస్తుదోషాలు ఉన్నాయని అనిపిస్తే వాస్తు హనుమాన్ పటాన్ని పెట్టి నిత్యం పూజిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు. గ్రహ దోషాలు కూడా నివారించబడతాయి. వాస్తు హనుమాన్ పటాన్ని పెట్టుకునే వాళ్లు ప్రతీ మంగళవారం నీళ్లతోకాని పాలతో కానీ కడిగి సింధూరం, గంధపు బొట్లు పెట్టి తులసీ దళంతో అలంకరిస్తే మంచిది.


Related News

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Big Stories

×