EPAPER
Kirrak Couples Episode 1

kitchen Tips : వంట గదిలో మంచినీళ్లు అక్కడ పెట్టకూడదా…?

kitchen Tips : వంట గదిలో మంచినీళ్లు అక్కడ పెట్టకూడదా…?
Shouldn't you put fresh water in the kitchen?


kitchen Tips : ఈ రోజుల్లో కూడా కిచెన్ లో స్టవ్ పక్కన నీళ్లు బిందె పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వంట గదిలో నీళ్ల బిందె ఆగ్నేయంలో పెట్టకూడదు. తెలియకుండానే ఆ దిశలో పెట్టడం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ల మాదిరిగా ఖర్చైపోతుందట. ఇంట్లో ఒక రూపాయి దాచాలన్నా ఉండదు. ఆ రూపాయికి ఏదో రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. అదే నీళ్ల బిందెను ఉత్తరం లేదా వాయవ్యంలోను పెడితే జీవితంతోపాటు సంపదలోను అభివృద్ధి జరుగుతుంది. ఉత్తరం లేదా వాయవ్యంలో నీళ్లు బిందె పెట్టుకునే పరిస్థితి లేకపోతే తూర్పు దిక్కులో కూడా పెట్టవచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఆగ్నేయ నుంచి దక్షిణం మధ్య కూడా నీళ్లు పెట్టడానికి ఉత్తమస్థానం కాదు.

పడమర వైపు కూడా పెట్టుకోవచ్చు కానీ పై రెండు దిక్కుల్లో సాధ్యం కానప్పడు మాత్రమే అటు వైపు చూడాలి. ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోవడం సరైన పద్దతే కానీ దాని పక్కనే నీళ్ల బిందెలులాంటివి మాత్రం మంచిది కాదు. గతంలో కిచెన్ ఫ్లాట్ ఫామ్ లాంటివి ఉండేవి కాదు. స్టవ్ కింద పెట్టుకుని వంట చేసుకునే వారు. ఇంట్లో పంచతత్వాల్లో ఒక్కోసారి ఏదో ఒక్కటి ఎక్కువవుతుంది. వాయుత్వం, అగ్నితత్వం, జలతత్వంలో ఇలా ఇందులో ఏది ఎక్కువైనా సమస్యలే. పంచ తత్వాల్లో ఇంట్లో ఏది ఎక్కువైందో తెలుసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉన్న వాటిని సరి చేయాలి. ఇంట్లో వాడే వస్తువుల రూపంలో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. . ఇంటికి వేసే రంగుల్లో కానీ, కర్టెన్స్ కలర్స్ కానీ ఇలాంటివి చూసుకుంటే తెలుస్తుంది.ఇంట్లో ఉన్న ఫోటోలు, పెయింటింగ్స్ , బొమ్మల రూపంలో కూడా పంచతత్వాలు తేడా ఉండొచ్చు. కొన్ని వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట పెట్టడం వల్ల కూడా ఈ మార్పులు జరుగుతాయి.


కిచెన్ లో ఉండే ఫ్లాట్ ఫామ్ కోసం ఎక్కువమంది బ్లాక్ కలర్ లో ఉండే స్టోన్ ను వాడుతుంటారు. శాస్త్ర ప్రకారం ఆగ్నేయంలో కిచెన్ ఉన్నప్పుడు రెడ్ స్టోన్ లేదా గ్రీన్ కలర్ స్టోన్ మాత్రమే వాడాలి. ఒక వేళ బ్లాక్ స్టోన్ వేసుకుని వాటికి పరిహారం కూడా ఉంది . స్టవ్ సైజ్ ఉన్న గ్రీన్ కలర్ స్టోన్ పొయ్యి కింద ఉంచాలి. అగ్ని, నీళ్లు కలవకుండా చూసుకోవడమే ఇందులో మర్మం. ఈ రెండూ కలిస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. గతంలో తక్కువ సంపాదన ఉన్నా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఎంత సంపాదన ఉన్నా సంతోషంగా లేరు. ఇలాంటి తప్పుల వల్లే చాలామంది అన్నీ ఉన్నా కష్టాలు పడుతుంటారు.

Related News

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Big Stories

×