EPAPER
Kirrak Couples Episode 1

Movies : ఆ చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఇవే..!

Movies : ఆ చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఇవే..!


Movies : బాలీవుడ్‌ దర్శకుడు విక్రమ్‌భట్‌ 2008లో తెరకెక్కించిన హారర్ చిత్రం 1920 . ఇది ఈ డైరెక్టర్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన తాజా చిత్రం 1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌. ఈ సినిమాలో అవికా గోర్‌ కీలక పాత్రలో నటించింది. కృష్ణ భట్‌ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించారు. ప్రముఖ డైరక్టర్, రైటర్ మహేశ్‌ భట్‌ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

కేజీఎఫ్‌ మూవీలను నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌. ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన తాజా చిత్రం ధూమం. విలక్షణ మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో కీలక పాత్రలో నటించాడు. పవన్‌ కుమార్‌ ఈ మూవీకి దర్శకుడు. అపర్ణ బాలమురళి హీరోయిన్ . ఈ మూవీ జూన్‌ 23న మలయాళం, తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.


శివ కందుకూరి , మేఘా ఆకాష్‌ , ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా భరత్‌ పెదగాని తెరకెక్కించిన చిత్రం మను చరిత్ర జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని శ్రీనివాసరెడ్డి, రాన్‌ సన్‌ జోసెఫ్‌ సంయుక్తంగా నిర్మించారు. కాజల్‌ అగర్వాల్‌ సమర్పకురాలుగా వ్యవహరిస్తున్నారు.

యంగ్ యాక్టర్స్ సదన్‌, దీపికారెడ్డి, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ భారీ తారాగణం. బీవీఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించిన ఈ మూవీని శేఖర్‌ ముత్యాల తెరకెక్కించాడు. భారీ తారాగణం జూన్‌ 23న విడుదల కానుంది.

ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

రాహుల్‌ రామకృష్ణ , నవ్య స్వామి, నరేష్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఇంటింటి రామాయణం. దర్శకుడు సురేశ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆహాలో జూన్‌ 23న నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ తొలిసారి నిర్మించిన చిత్రం టీకూ వెడ్స్‌ షేరు. ఈ మూవీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అవనీత్‌ కౌర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్‌ శ్రీవాస్తవ తెరకెక్కించాడు. ఆమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జూన్‌ 23 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ మలయాళంలో నిర్మిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ కేరళ క్రైమ్‌ ఫైల్స్‌. ఇందులో లాల్‌, అజు వర్గీస్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూన్‌ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌..
క్లాస్‌ ఆఫ్‌ 09 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 19
సీక్రెట్‌ ఇన్వేషన్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 21
వరల్డ్స్‌ బెస్ట్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 23
ది కేరళ స్టోరీ (హిందీ)- జూన్‌ 23

జీ5..
కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌ (హిందీ)- జూన్‌ 23

సోనీలివ్‌..
ఏజెంట్‌ (తెలుగు)- జూన్‌23

నెట్‌ఫ్లిక్స్‌..
టేక్‌ కేర్‌ ఆఫ్‌ మాయా (హాలీవుడ్)- జూన్‌ 19
గ్లామరస్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)- జూన్‌ 21
సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్‌)- జూన్‌ 22
స్లీపింగ్‌ డాగ్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 22
ఐ నంబర్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 23

Related News

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Big Tv Exclusive : దసరాకి గేమ్ ఛేంజర్ ట్రైలర్… చెర్రీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండమ్మా

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు ?

Big Stories

×