EPAPER

Pawan Kalyan: కోన్‌కిస్కాకు భయపడేది లేదు.. ద్వారంపూడిని దంచేసిన జనసేనాని..

Pawan Kalyan: కోన్‌కిస్కాకు భయపడేది లేదు.. ద్వారంపూడిని దంచేసిన జనసేనాని..
pawan-kalyan kakinada

Pawan Kalyan: అన్నట్టుగానే జనసేనాని.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై చెలరేగిపోయారు. ద్వారంపూడి చరిత్ర అంతా తవ్వి పోశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో.. తనను దిగజారి బూతులు తిడుతూ.. ద్వారంపూడి తీవ్ర పదజాలం వాడారని గుర్తు చేశారు. అయినా, తనకు కోపం రాలేదని.. కానీ, జనసైనికులపై దాడి చేస్తే మాత్రం చాలా ఆవేశం వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకొచ్చిన కోపానికి స్పందించి ఉంటే.. ద్వారంపూడి ఉండేవాడే కాదని అన్నారు.


ద్వారంపూడిని.. డెకాయిట్ చంద్రశేఖర్‌రెడ్డి అంటూ విమర్శించారు. బియ్యం ఎక్స్‌పోర్ట్‌లో 15వేల కోట్లు సంపాదించారని.. దొంగనోట్లు ముద్రిస్తారని.. కబ్జాలకు పాల్పడుతుంటారని.. ఆయన అనుచరులు కత్తులు, తుపాకులతో బెదిరిస్తుంటారని.. గతంలో ద్వారంపూడి కుటుంబంలోని వారిని ఐపీఎస్ ఆఫీసర్ డీటీ నాయక్ పోలీస్ జీపుకు వెనుకాల కట్టి ఈడ్చుకుపోయారంటూ.. ఎమ్మెల్యే నేరచరిత్రనంతా బయటపెట్టారు పవన్ కల్యాణ్.

వచ్చే ఎన్నికల్లో కాకినాడ అర్బన్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి గెలవకుండా చూస్తానని హెచ్చరించారు. గుండాలకు భయపడేది లేదని.. తాను ఏపీలోనే ఉంటానని.. ప్రజల ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డువేస్తానన్నారు పవన్.


వైసీపీ ఎమ్మెల్సీ దళితుడిని చంపేసి, శవాన్ని డోర్ డెలివరీ చేయడం ఎంత దారుణమన్నారు. ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూల్ చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోందన్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×