EPAPER
Kirrak Couples Episode 1

Kitchen Vastu : వంటగదిలో ఆ వైపు సింక్ ఉండకూడదా…?

Kitchen Vastu : వంటగదిలో ఆ వైపు సింక్ ఉండకూడదా…?

Kitchen Vastu : వాస్తు బాగుంటే ఇల్లు బాగుంటుంది…ఇల్లు బాగుంటే ఇంట్లో వాళ్లంతా బాగుంటారని అంటోంది వాస్తుశాస్త్రం. ఏ వస్తువు అక్కడ ఉండకపోయినా…పెట్టాల్సి పెట్టాల్సిన వస్తువులు లేకపోయినా ఆ ఇంటి వారికి ఆర్ధిక సమస్యలు వస్తాయంటున్నారు వాస్తునిపుణులు. ముఖ్యంగా ఇంట్లో సింక్ విషయంలో జాగ్రత్త తప్పనిసరి అని సూచిస్తున్నారు. సింక్ కరెక్ట్ పొజిషిన్ లో లేకపోతే అదృష్టం బదులు దురదృష్టం పట్టుకుంది. సహజంగా ఏ ఇంట్లో అయినా ఆగ్నేయంలో వంట గది ఉంటుంది . వాస్తును ఫాలో అయ్యే వారు ఆగ్నేయం వైపు కిచెన్ ఉండేలా చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాయువ్యలో వంట గది ఏర్పాటు చేసుకుంటారు.


ఈశాన్యం లేదా నైరుతి వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట గది ఉండకూడదు.
వంట గది ఆగ్నేయ వైపు ఉన్నా…వాయువ్యంలో ఉన్నా వంట చేసేటప్పుడు వారి ముఖం తూర్పు ఉండాలంటోంది శాస్త్రం. పడమర, ఉత్తర, దక్షిణ వైపు చూస్తూ వంట చేసే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలా వంట గది ఉండే వారికి నిత్యం ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. తూర్పు వైపు వంట చేసేటప్పుడు ఎడమ వైపు సింక్ ఉండాలి. వాస్తు పరంగా అది ఉత్తమమైన స్థానం అవుతుంది. ఈశాన్యం వైపు సింక్ ఉంటే అభివృద్ధి ఉంటుంది. సింక్ కుడి వైపు ఉన్నా…వెనక్కి తిరిగి వాష్ చేసుకునేలా సింక్ ఏర్పాటు చేసినా ఆర్ధికంగా ధన నష్టం కలిగిస్తుంది. రైట్ సైడ్ సింక్ ఉంటే అది ఆగ్నేయం వైపు ఉన్నట్టే లెక్క. అది ఏమాత్రం మంచిది కాదు.

నైరుతి వైపు కూడా సింక్ కూడా ఉండకూడదు. అలాగే సింక్ కు గ్యాస్ స్టవ్ కూడా దూరం ఉండాలి. సింక్ నీళ్లు గ్యాస్ స్టవ్ పై పడకూడదు. ఎందుకంటే నీటికి, అగ్నికి శత్రుత్వం ఉంటుంది. వంట గదిలో వీలైతే రెండు కిటికీలు ఉంటే మంచిది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే డస్ట్ బిన్ అనేది ఈశాన్యంలో ఉండకూడదు. నైరుతి వైపు మాత్రమే ఉండాలి. ఇంట్లో పనికి రాని వస్తువులు, విరిగిపోయినవి ఏవైనా ఉంటే వాటిని బయటపడేయాలి. ఒకవేళ ఇంట్లో పెట్టాల్సి వస్తే నైరుతి వైపు మాత్రమే పెట్టుకోవాలి. నైరుతిలోనే డస్ట్ బిన్ ఉండాలి. ఈశాన్యంలో డస్ట్ బిన్ ఉంటే నాభికి సంబంధించి సమస్యలు ఇంటి యజమానిని వేధిస్తాయి. నైరుతిలో డస్ట్ బిన్ పెట్టుకునే పరిస్థితి లేకపోతే దక్షిణం లేదా పడమర వైపు పెట్టుకోవచ్చు.


Related News

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Big Stories

×