EPAPER
Kirrak Couples Episode 1

Ishtakameshwari Temple : నుదుటున బొట్టుపెడితే స్పందించే దేవత

Ishtakameshwari Temple : నుదుటున బొట్టుపెడితే స్పందించే దేవత
Ishtakameshwari Temple


Ishtakameshwari Temple : శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి ఆలయం తర్వాత అత్యంత మహిమాన్వితమైన స్థలం ఉంది. ఒకప్పుడు సిద్దులతో పూజలందుకున్న ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. శ్రీశైలం నుంచి డోర్నాలికి వెళ్లే దారిలో ఇది ఉంటుంది. అమ్మవారి దర్శనం కూడా అంత ఈజీ కాదు. దట్టమైన అడవుల్లో కాస్త కష్టంతో కూడిన ప్రయాణం చేసిన వారికి మాత్రమే ఇష్ట కామేశ్వరి మాత దర్శనం కలుగుతుంది. చిన్న గుహలాంటి ఆలయంలో అమ్మవారి ప్రతిమ ఉంటుంది. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. మహా శక్తిమంతమైన ప్రదేశంలోఉన్న భావన మనలో ఏర్పడుతుంది. అమ్మవారు నాలుగు భుజాలతో రెండు చేతులలో తామర పుష్పాలను … మిగతా రెండు చేతుల్లో జపమాల శివలింగంతో కనిస్తుంది. అమ్మ వారు శివుడ్ని వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేసింది.

అమ్మవారు నిమ్మకాయల దండలను ధరించి వుంటుంది. ఇష్టకామేశ్వరి మాత నుదురు మెత్తగా ఉంటుందని విగ్రహానికి తాకి అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. దట్టమైన అడవిలోని అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇష్టకామేశ్వరి వత్రంలో ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. గతంలో ఈ విగ్రహం రంగులు కూడా మారేదని అంటారు. చంద్రకళ వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరిగేదట. అమ్మవారికి విగ్రహానికి బొట్టు పెట్టి పొంగలి నైవేద్యంగా పెటి కోరుకుంటే అది నేరవేరితీరుతుందని నమ్మకం.


అసలు ఈవిగ్రహానికి శైలపుత్రి అని పేరు కానీ..ఇష్టమైన కోరికలు నెరవేర్చే మాతగా పేరు రావడంతో ఇష్టకామేశ్వరిదేవీ భక్తుల మనసుల్ల స్థిరపడిపోయింది. అదే నామంతో ఇప్పుడు వెలుగొందుతోంది. బొట్టు పెట్టి కోరుకుంటే శైలపుత్రి కరుణిస్తుంది. నుదుటున ఉండే భాగం తప్ప మిగిలిన విగ్రహమంతా రాతితోనే ఉంటుంది. ఇంత విశిష్టిత ఉన్న అమ్మవారి దర్శనం చేసుకోలేని వారు భక్తితో అమ్మవారిని పూజించి మనసులో కోరుకుని ఇంట్లో వ్రతం ఆచరించవచ్చు. ఇష్టకామేశ్వరిని చిత్తశుద్ధిగా పూజిస్తే కోరిన కోరికలు 41 రోజులలో ను సిద్ధింప చేస్తుందని భక్తుల విశ్వాసం..

Related News

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Guru Nakshatra Parivartan: 2025 వరకు ఈ రాశుల వారి అదృష్టం ప్రకాశవంతంగా ఉంటుంది

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Big Stories

×