EPAPER
Kirrak Couples Episode 1

Pawan Kalyan : వారాహికి గ్రీన్ సిగ్నల్.. పోలీసుల షరతులు ఇవే..!

Pawan Kalyan : వారాహికి గ్రీన్ సిగ్నల్.. పోలీసుల షరతులు ఇవే..!


Pawan Kalyan varahi tour updates(Latest telugu news in AP): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు లైన్‌ క్లియర్ అయింది. పోలీసుల తరఫు నుంచి వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు . డీఎస్పీలు జనసేన నేతలకు ఎక్కడికక్కడ టచ్‌లోనే ఉన్నారని తెలిపారు. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని వివరణ ఇచ్చారు. జన కార్యకర్తలు ఎలాంటి హడావుడి చేయకుండా, సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అవ్వడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామన్నారు జనసేన నేత కందుల దుర్గేష్‌. పోలీసు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. యాత్ర సజావుగా సాగేందుకు జనసైనికులు సహకరించాలని కోరారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు మంగళవారం సాయంత్రానికి జనసేనాని అన్నవరం చేరుకుంటారు. బుధవారం ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేస్తారు. అన్నవరం వీరవెంకట సత్యనారయణస్వామిని దర్శించుకుంటారు. కత్తిపూడిలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×