EPAPER
Kirrak Couples Episode 1

Reception : రిసెప్షన్ ఏ దిక్కున ఉండాలి?

Reception : రిసెప్షన్ ఏ దిక్కున ఉండాలి?
reception


Reception : మారుతున్న కాలంతోపాటు భవన నిర్మాణంలో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి కల్చర్ మనకు బాగా వంటపడుతోంది. ఏ స్థాయి ఆఫీసులు కట్టినా అందులో ముందుగా కనిపించేది రిసెప్షన్. మనిషి ఆర్ధికాభివృద్ధికి, ఎదుగుదలకి కేంద్రస్థానమైన ఆఫీసు వాస్తు నియమాలు పాటించడం ఉత్తమమైన నిర్ణయం అవుతుంది. ఎంట్రన్స్ లోనే ఆఫీసు స్థాయి ఏంటో చెప్ప గలిగేది రిసెప్షన్ విభాగం కూడా. అక్కడ కనిపించే ఫస్ట్ లుక్, ఫస్ట్ రిసీవింగ్ బట్టి ఆఫీసుపై ఒక అంచనాకి రావచ్చన్న అభిప్రాయం ఉంది. ఏ ఆఫీస్ లో అయినా సరే మొట్టమొదట ఎవరినైనా కలువాలంటే వెయిట్ చేసేది రిసెప్షన్ లోనే. అక్కడే ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు లోపలకి వెళ్లాళో వద్దో అక్కడే డిసైడ్ చేసుకోవచ్చు.ముఖ్యంగా బిజినెస్ ఆఫీసుల్లో రిసెప్షన్ కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇవ్వాలి కూడా

రిసెప్షన్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. రిసెప్షన్ ఎప్పుడు కూడా కస్టమర్లని ఆకర్షించే విధంగా ఉండాలి. ఆఫీసుని వాస్తు పరంగా నిర్మించేటప్పుడు రిసెప్షన్ ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే డిజైన్ చేయకూడదు. ఆఫీసు ముఖ ద్వారం దగ్గర ఉండే రిసెప్షన్ ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టకూడదు. లోపల ఆఫీసు బాగున్న రిసెప్షన్ కూడా ఎట్రాక్ట్ గా ఉండేలా వాస్తుని ఫాలో కావాలి. ఏదో మూల ఇరికించి పెట్టకూడదు. దానికి వాస్తు పాటిస్తే మంచి పొజిటిషన్ ఆఫీసుకి కలుగుతుంది. ఎప్పుడు కూడా రిసెప్షన్ దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ ఉండాలి అక్కడ కూర్చునే వ్యక్తి ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి ఉండాలి. లేదంటే తూర్పు వైపున అయినా సరే పర్వాలేదు. ఇలా ఈ విధంగా ఆఫీస్ లో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు .వాస్తు ప్రకారం ఇలా అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది చక్కగా అభివృద్ధి అవ్వచ్చు


ఆఫీసులో ఉండే యజమాని , సీఈవో స్థాయి వ్యక్తి ఉండే గదిలో టేబుల్ దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే ఉండాలి. నైరుతి గదిలో తూర్పు ముఖంగా కూర్చోవాలి. దీని వల్ల సంస్థ విజయ పథంలో వెళ్తుంది. యజమాని చెప్పిన మాట ఎంప్లాయిస్ తూచా తప్పకుండా వింటారు. ఆఫీసుకి సంబంధించి కీలక డాక్య్లుమెంట్లు నైరుతి మూల ఉండే బీరువాలో పెట్టుకోవడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.

Related News

Toilet Vastu Tips: కొత్త ఇళ్లు కడుతున్నారా.. టాయిలెట్ ఈ దిశలో ఉంటే కెరీర్‌లో పురోగతి ఉండదు..

Navratri Colours 2024: నవరాత్రుల పూజల్లో ధరించాల్సిన 9 రంగులు ఇవే..

Weekly Rashifal: సెప్టెంబర్ చివరి వారం 4 రాశుల వారు శుభవార్తలు అందుకోవచ్చు

Horoscope 23 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం..శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం!

Kuber Favourite Zodiac: కుబేరుడికి ఇష్టమైన ఈ 3 రాశుల వారు లక్షాధికారులు కాబోతున్నారు

Budh Gochar in Kanya Rashi: రాబోయే 24 గంటల్లో కన్యాతో సహా 5 రాశులు ధనవంతులు కాబోతున్నారు

Ketu Transit 2024: అక్టోబర్ 10 వరకు ఈ రాశులపై సంపద వర్షం

Big Stories

×