EPAPER
Kirrak Couples Episode 1

Mari Amman temple : శరీరా భాగాల్ని హుండీలో వేసే ఆచారం ఉన్న టెంపుల్

Mari Amman temple : శరీరా భాగాల్ని హుండీలో వేసే ఆచారం ఉన్న టెంపుల్


Mari Amman temple : తమిళనాడు ప్రసిద్ధ దేవాలయాలకు కేరాఫ్ అడ్రస్ . దక్షిణాదిన ఎక్కువ ఆలయాలు కనిపించే తమిళనాడులో మారి అమ్మన్ విశిష్టమైంది. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయలకి చిహ్నంగా ఆలయాన్ని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే ఎలాంటి మొండి రోగాలైనా మటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో మంది భక్తులు నమ్మకంగా ఈక్షేత్రానికి వస్తుంటారు. శరీర భాగాల ముక్కలు హుండీలో వేసే ఆచారం ఈ ఒక్క ఆలయంలోనే కనిపిస్తుంది. ఉప్పును కూడా అమ్మవారికి సమర్పిచే పద్దతి ఇక్కడ చూడొచ్చు. తమిళనాడులో గ్రామ దేవతగా పూజలందుకోంటి సమయపురం మారి అమ్మన్. తిరుచురాపల్లికి సమీపంలో ఉంది ఈ ఆలయం. అమ్మవారిని దుర్గాదేవి, మహాకాళి ప్రతిరూపాలుగా ఆరాధిస్తుంటారు భక్తులు.

శిలతో ఏర్పాటు చేసిన విగ్రహం ఇక్కడ కనిపించదు. ఇసుక బంక మట్టితోనే అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేయడం ఇక్కడ విశేషం. అందుకే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించరు. ఆ తల్లిని పోలిన చిన్న రాతి విగ్రహానికి మాత్రమే అభిషేకం చేస్తారు. దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో పురాతమైన ఆలయం ఇది. జీవితం బాగుండేలా మంచి భవిష్యత్ దక్కాలని కోరుకునే వారు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఫిజీ, శ్రీలంక లాంటి దేశాల్లో మారి అమ్మన్ వారి ఆలయాలు ఉన్నాయి.


ఆరోగ్య సమస్యలతోపాటు బాధపడే వారు మారి అమ్మన్ ను దర్శిస్తే నయం అవుతుందని నమ్ముతుంటారు. శరీరంలో ఏ భాగానికి సమస్య ఉందో ఆ భాగం ప్రతిబింబించే విధంగా వెండితో కానీ, స్టీల్ తోకాని లోరూపాన్ని తయారు చేయించి మొక్కుగా చెల్లిస్తుంటారు. అలా చేస్తే వారికి ఉన్న వ్యాధి నయం అవుతుందని భక్తుల నమ్మకం. ఎన్నో తరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ నేటికి సజీవంగా ఉంది. తనను నమ్మిన భక్తుల్ని ఆ తల్లికాపాడుకుంటూ ఉంటుంది. ప్రతీ ఆదివారం, మంగళవారం, శుక్రవారం వేలాది భక్తులతో ఆలయం రద్దీగా ఉంటుంది. తమిళనాడులో అత్యంత సంపన్నఆలయాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. సమయపురం మారి అమ్మన్ ఆలయానికి విశేషంగా ఆదాయం వస్తుంటుంది.

Related News

Shardiya Navratri 2024 : నవరాత్రులులోపు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచకండి

Shani Margi 2024: అక్టోబర్‌లో శని గ్రహం వల్ల 3 రాశుల్లో పెద్ద మార్పు

Toilet Vastu Tips: కొత్త ఇళ్లు కడుతున్నారా.. టాయిలెట్ ఈ దిశలో ఉంటే కెరీర్‌లో పురోగతి ఉండదు..

Navratri Colours 2024: నవరాత్రుల పూజల్లో ధరించాల్సిన 9 రంగులు ఇవే..

Weekly Rashifal: సెప్టెంబర్ చివరి వారం 4 రాశుల వారు శుభవార్తలు అందుకోవచ్చు

Horoscope 23 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం..శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం!

Kuber Favourite Zodiac: కుబేరుడికి ఇష్టమైన ఈ 3 రాశుల వారు లక్షాధికారులు కాబోతున్నారు

Big Stories

×