EPAPER

Science and Technology : సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్న ఈ రెండు విభాగాలు..

Science and Technology : సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్న ఈ రెండు విభాగాలు..


Science and Technology : సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగమయ్యే ప్రతీ సబ్జెక్ట్‌కు ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. కొన్నిసార్లు రెండు సబ్జెక్ట్స్‌కు చాలా దగ్గర పోలికలు కూడా ఉంటాయి. లేదా రెండు ఇంటర్‌లింక్ అయ్యింటాయి. అలాగే డేటా సైన్స్, రోబోటిక్స్.. బయట నుండి చూడడానికి ఇవి రెండు వేర్వేరు సబ్జెక్ట్స్ లాగా అనిపించినా.. ఈ రెండిటికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆ దగ్గర పోలికలు ఏంటో కూడా వారు బయటపెట్టారు.

ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. అందులోనూ ముఖ్యంగా డేటా సైన్స్, రోబోటిక్స్.. అనేవి ఈ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. డేటా సైన్స్‌లో ప్రతీరోజూ ఇంజనీర్లు ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం, దాంతో అద్భుతాలు సృష్టించడం కామన్‌గా మారిపోయిందని అన్నారు. ఇప్పుడు దానికి పోటీని ఇవ్వడానికి రోబోటిక్స్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాకపోతే రోబోటిక్స్ రంగంలో తగిన వనరులు లేకపోవడం వల్ల శాస్త్రవేత్తలు కొంచెం వెనకబడాల్సి వస్తోంది.


టెక్నాలజీని మన చేతుల్లో తీసుకోవడానికి, దాంతో అద్భుతాలు సృష్టించడానికి డేటా సైన్స్ అనేది ఉంటే చాలు అని పలువులు ఇంజనీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. డేటా సైంటిస్టులుగా మారాలనుకునేవారు అవకాశాల కోసం ఇతరేతర దేశాలకు వెళ్లకుండా ఎవరి దేశంలో వాళ్లకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా మారాయి. అలాగే రోబోటిక్స్ విషయంలో కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి గత కొన్నేళ్లలో బాగానే పెరిగాయని నిపుణులు చెప్తున్నారు.

డేటా సైన్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్‌లాగా మారిపోయింది. రోబోటిక్స్‌ను కూడా ఇప్పుడు పెద్ద బిజినెస్‌లాగానే చూస్తున్నారు చాలావరకు ప్రైవేట్ సంస్థలు. చాలావరకు సంస్థలు రోబోలను తయారు చేసి ఇతరేతల రంగాలకు ట్రాన్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో ఫీల్డ్స్‌లో రోబోలు అనేవి మామూలు పనులకు కూడా ఉపయోగపడుతున్నాయి. సరైన స్కిల్స్ ఉంటే డేటా సైన్స్ అయినా, రోబోటిక్స్ అయినా ఒకటే అని, ఈరోజుల్లో ఈ రెండు రంగాల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Big Stories

×