EPAPER

Swarna Bhasana : పిల్లలకు స్వర్ణ భాసన చేయాలా….

Swarna Bhasana : పిల్లలకు స్వర్ణ భాసన చేయాలా….


Swarna Bhasana : ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో పసిపిల్లలకి స్వర్ణప్రాసన ప్రస్తావన ఉంది. గురువారం పుష్యమి నక్షత్రం లేదా ఆదివారం పుష్యమి నక్షత్ర సమయాన మాత్రమే శిశువునకు స్వర్ణప్రాసన చేయించాల్సి ఉంటుంది. ఇతర రోజులలో ఈ పని చేయకూడదు.. స్వర్ణప్రాసన అంటే ఈ రోజుల్లో చేతికి ఉన్న ఉంగరం తీసి శిశువు నాలికమీద రాస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒక గుండుపిన్ను లేదా ఏదైనా సన్నటి వస్తువు తీసుకుని తేనె తగిలించాలి. ఆ పిమ్మటే ఆవు నెయ్యి తగిలించిన తర్వాత స్వర్ణభస్మానికి తాకించి అప్పుడు శిశువు నాలిక మీద అంటించాలి . కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో తల్లి కడుపు నుంచి శిశువు బయటకి వచ్చిన తరువాత శుభ్రపరచి తేనెతో పాటు స్వర్ణభస్మాన్ని నాలికపైన రాయాలని ఉంది. ఈ స్వర్ణభస్మం నిత్యం పిల్లలకు వాడితే బృహస్పతితో సమానమైన తెలివితేటలు కలుగుతాయని నమ్మకం. స్వర్ణభస్మం తీసుకుంటే ఏకసంధా గ్రాహుకులు అవుతారు.

ఆయుష్షుని పెంచేందుకు ఉపయోగపడే వాటిలో అరుదైనది ముఖ్యమైనది స్వర్ణభస్మం. ఆయువుని వృద్ధిచేయు ఔషధాల్లో స్వర్ణభస్మం ప్రధానమైనది. బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని కలిగిస్తుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతి పెంచుతుంది. పాపాల వల్ల సంక్రమించు రోగాలను పోగోట్టే శక్తి దీనికి ఉంది . ఏదైనా కారణంతో శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠికి ఉపయోగపడుతుంది.ఇతర ఔషధాలతో తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మం వాడకం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయోగిస్తారు. అయితే స్వర్ణ భస్మం చాలా ఖరీదైంది. విలువైన భస్మం కావడంతో ధనవంతులు మాత్రమే ఇది ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంది.


అదే శిశువులకి అన్న ప్రాసన అందరూ చేస్తుంటారు. మగపిల్లలకు సరి సంఖ్యలో వచ్చే నెలల్లో చేస్తారు. అంటే ఆరు, ఎనిమిది నెలలో చూసి చూస్తారు. అదే ఆడపిల్లలకి బేసి సంఖ్య చూసుకుని ఐదు, ఏడు, తొమ్మిది ఇలా చూసుకుని చేస్తారు. అన్నప్రాసన ముహూర్తం బట్టే శిశువు ఆరోగ్యం, జీవితం ఆధారపడి ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మంచి ముహూర్తం చూసుకుని పెద్దల సమక్షంలో తల్లిదండ్రులు పిల్లలకి అన్నప్రాసన చేయిస్తుంటారు.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×