EPAPER
Kirrak Couples Episode 1

Obesity: డిప్రెషన్‌కు దారితీస్తున్న ఒబిసిటీ.. ముఖ్యంగా పిల్లల్లో..

Obesity: డిప్రెషన్‌కు దారితీస్తున్న ఒబిసిటీ.. ముఖ్యంగా పిల్లల్లో..

Obesity: ఈరోజుల్లో పలు ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్య అనేది ఇంకే సమస్యకు దారితీస్తుంది అని చెప్పడం కూడా కష్టమయిపోతుంది. ఈ అంశం శాస్త్రవేత్తలను మరిన్ని ఇబ్బందులకు గురయ్యేలా చేస్తోంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిలో కనిపిస్తున్న సమస్య. అలాంటి వ్యాధుల్లో ఒకటైన ఒబిసిటీ.. పేషెంట్ మెంటల్ హెల్త్‌పై కూడా ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.


ఒబిసిటీ అనేది మనిషి శరీరం మీద మాత్రమే కాదు.. మనసుపై కూడా ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతే కాకుండా దాని వల్ల డిప్రెషన్ కూడా రావచ్చని తేల్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలో, టీనేజ్ వారిలో ఒబిసిటీ అనేది డిప్రెషన్‌కు దారితీసేలా చేస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రోనిక్ వ్యాధులలో ఒబిసిటీ ప్రథమ స్థానంలో ఉంది. అది కూడా ఎక్కువగా చిన్నపిల్లలో, టీనేజ్ వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ఒక శారీరిక సమస్య.. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడం అనేది మనం చాలా జాగ్రత్తపడాల్సిన విషయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

శాస్త్రవేత్తలు చేసిన స్టడీ ప్రకారం వచ్చే 12 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు 51 శాతం మంది ఒబిసిటీతో బాధపడతారని నిర్ధారణ అయ్యింది. వయసుకు మించిన బరువు ఉండడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా హేళనకు గురవుతారు. అందుకే వారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే అవకాశం ఉంది. అది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా మనుషులకు దూరంగా ఉంటూ ఫుడ్‌ను వారి కంఫర్ట్‌గా మార్చుకుంటారు. దాని వల్ల సమస్య మరింత తీవ్రంగా మారుతుందన్నారు.


మామూలు పిల్లలతో పోలిస్తే ఒబిసిటీ ఉన్న పిల్లలో డిప్రెషన్ వచ్చే అవకాశం 32 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే ఈ రిస్క్ 44 శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇండియాలో చైల్ట్‌హుడ్ ఒబిసిటీ అనేది ఒక మహమ్మారిగా మారిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఒబిసిటీతో బాధపడుతున్న పిల్లలు ఉన్న దేశంగా మొదటిస్థానంలో చైనా ఉండగా రెండోస్థానంలో ఇండియా ఉంది. ఇండియాలో ఒబిసిటీతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 14.4 మిలియన్.

పిల్లల్లో ఒబిసిటీ అనేది కనిపించినప్పుడు తల్లిదండ్రులతో పాటు టీచర్లు కూడా వారికి మానసికంగా ప్రోత్సాహాన్ని అందించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒబిసిటీకి సరైన చికిత్సలు, మెడిసిన్స్ లేకపోవడం వల్ల తల్లిదండ్రులే ఎక్కవ జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఒబిసిటీ ఉన్న పిల్లల ఆహారపు అలవాట్లను మార్చడం, వారికి వ్యాయామం లాంటివి అలవాటు చేయడం వల్ల వారు బరువు తగ్గడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా బయట ఆహారాన్ని అసలు ప్రోత్సహించకూడదని తెలిపారు.

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×