EPAPER
Kirrak Couples Episode 1

NTR: చిరు, నాగ్‌ రాకుండా.. చరణ్, చైతులను పంపించారా? అందుకేనా?

NTR: చిరు, నాగ్‌ రాకుండా.. చరణ్, చైతులను పంపించారా? అందుకేనా?
ntr nbk chiru nag

NTR: ఎన్టీఆర్ శతజయంతి వేడుక. హైదరాబాద్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిగింది. అన్నగారి ఈవెంట్‌కు హేమాహేమీలు తరలివచ్చారు. బాలకృష్ణ, వెంకటేష్ లాంటి టాప్ హీరోస్.. రామ్ చరణ్, చైతులాంటి యంగ్ హీరోస్ విచ్చేశారు. ఇదే కాస్త హార్డ్‌గా అనిపించిందంటున్నారు చూసిన వాళ్లంతా.


విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగుజాతి నిండు గౌరవం ఆయన. తెరపై రాముడు, కృష్ణుడూ ఆయనే. తెలుగోడి దెబ్బ ఢిల్లీకి రుచి చూపించినా, తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించినా.. అది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. అంతటి మహనీయుడి వందవ జయంతి వేడుక అంత అట్టహాసంగా నిర్వహిస్తే.. చిరంజీవి, నాగార్జునలు రాకుండా వారి పిల్లలను పంపిస్తారా? ఎన్టీఆర్ స్థాయికి వారిచ్చే గౌరవం ఇదేనా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి తమది కాదంటూ రామ్, చైతులే వేదికపై చెప్పిన విషయం ముమ్మాటికి నిజం. తారక రాముడి గురించి ఈ యంగ్ హీరోలు మాట్లాడేది ఏముంటుంది? పెద్ద ఎన్టీఆర్‌తో వీరేమైనా కలిసి పని చేశారా? ఆయన్ను దగ్గర నుంచి చూశారా? ఆయన అడుగుజాడల్లో ఏమైనా నడిచారా? వారి తండ్రుల నుంచి ఎన్టీఆర్ విశేషాలు అడిగి తెలుసుకొని.. ఆ వేదికపై మాట్లాడి ఉంటారు. ఆ రామారావు గురించి విశేషాలు తమ పిల్లలకు చెప్పి ఈ ఈవెంట్‌కు పంపించడం కంటే.. ఇండస్ట్రీ పెద్దలుగా చెలామని అయ్యే చిరంజీవి, నాగార్జునలే నేరుగా ఈ కార్యక్రమానికి రావొచ్చుగా? చిన్న చిన్న సినీ ఫంక్షన్లకే హాజరై.. పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇచ్చే చిరంజీవి, ఆయన వెన్నంటే ఉండే నాగార్జున.. ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టడం ఎంత వరకు కరెక్ట్? తాము రాకుండా రామ్ చరణ్, చైతన్యలను ఇంతటి బిగ్ ఈవెంట్‌కు పంపించడం సరైనదేనా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాళ్లిద్దరినీ పిలవలేదని కొందరు అంటుంటే.. లేదు లేదు పిలిచారు కానీ వారే రాలేదని కూడా చెబుతున్నారు. చిరును పిలవకుండా చరణ్‌ను పిలిచారని అనుకోలేంగా? వెంకటేష్‌కు ఇన్విటేషన్ ఇచ్చి నాగార్జునకు ఇవ్వలేదని ఎలా అనుకుంటాం?


బాలకృష్ణ, చిరంజీవిల మధ్య గతంలో మంచి సంబంధాలు ఉండేవి కావంటారు. కానీ, అన్‌స్టాపబుల్ షో తో మెగా ఫ్యామిలీకి, బాలయ్య బాబు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు బాగానే ఉంటున్నారు. చిరు ఓకే కానీ, నాగార్జున-బాలకృష్ణలకు మాత్రం అసలేమాత్రం పడదనేది ఓపెన్ సీక్రెట్. ఈయన ఆయనను పట్టించుకోరు.. ఆయన ఈయనను కేర్ చేయరు. వాళ్లిద్దరు ఉప్పు-నిప్పు టైప్ అంటారు. అందుకే, ఎన్టీఆర్ శత జయంతి వేడుక బాలకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టే.. నాగార్జున ఈ కార్యక్రమానికి రాకుండా చైతన్యను పంపిచారని అంటున్నారు. వెంకటేశ్, చిరంజీవిలు హాజరై నాగార్జున ఒక్కరే రాకపోతే అస్సలు బాగోదని భావించి.. తనకు అత్యంత సన్నిహితుడైన నాగార్జున కోసం చిరు సైతం ఈ ప్రోగ్రామ్‌కు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఇక, ఏపీలో జరిగిన సెలబ్రేషన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకావడం, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రాజకీయ ప్రస్తావన చేయడం.. అదికాస్తా తీవ్ర వివాదంగా మారడంతో.. ఎందుకైనా మంచిదని చిరంజీవి, నాగార్జునలు రాలేదని కూడా అంటున్నారు. రజినీకాంత్ ఎపిసోడే వీరి గౌర్హాజరుకు కారణం కావొచ్చనే టాక్ ఉంది. కారణాలు ఏవైనా.. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి శతజయంతి వేడుకలకు చిరు, నాగ్‌లు రాకుండా.. రామ్, చైతులను పంపించడం అస్సలు బాలేదని సోషల్ మీడియాలో చర్చ, రచ్చ నడుస్తోంది.

Related News

TDP vs JANASENA: మేము ఉండగా మీ పెత్తనం ఏంటి ? పింఛన్ పంపిణీలో జనసేన నేతను అడ్డుకున్న టీడీపీ.. ఉద్రిక్తత

KA Paul: చర్చిలపై ప్రభుత్వ పెత్తనం లేదు.. ఆలయాలపై ఎందుకు? చంద్రబాబు, పవన్‌లపై కె.ఎ.పాల్ షాకింగ్ కామెంట్స్

AP Liquor: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

Appsc new chairman: ఏపీపీఎస్సీ న్యూ ఛైర్మన్, వారికే ఛాన్స్

Tirumala laddu row: లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? కెమికల్ ఇంజనీర్ల నిపుణలేమంటున్నారు?

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

Big Stories

×