EPAPER
Kirrak Couples Episode 1

Modi: వారిని దెబ్బ కొట్టేందుకే 2వేల నోటు రద్దు? మోదీ మామూలోడు కాదుగా!

Modi: వారిని దెబ్బ కొట్టేందుకే 2వేల నోటు రద్దు? మోదీ మామూలోడు కాదుగా!
kcr modi

Modi: 2వేల నోటు రద్దు. ఎప్పటి నుంచో ఉంది డిమాండ్. కానీ, ఇన్నాళ్లూ పట్టించుకోలే. సడెన్‌గా ఇప్పుడు బ్యాన్ అన్నారు. ఎందుకు? అప్పట్లో డీమానిటైజేషన్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 2వేల నోటును ఎందుకు రద్దు చేసినట్టు? మోదీ తీసుకొచ్చిన నోటును.. మోదీనే ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? అంత అనాలోచితంగా నిర్ణయం తీసుకోరుగా? తెరవెనుక ఏదో లెక్క ఉండే ఉంటుందిగా?


అవును, 2వేల నోటు రద్దు వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రతిపక్ష పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకే అంటున్నారు. ఎన్నికలను బ్లాక్‌మనీని వేరు చేసి చూడలేం. పార్టీలన్నీ డబ్బు లెక్కల ప్రకారమే నడుస్తాయనడంలో సందేహం లేదు. ఎలక్షన్లలో నెగ్గాలంటే.. మనీనే కీ రోల్ అనేది ఓపెన్ సీక్రెట్. ఈ యేడాది తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎలక్షన్ కూడా ఉంటుంది. విపక్ష పార్టీలన్నీ మోదీపై దండయాత్రకు డబ్బు కూడబెట్టుకున్నాయి. అదంతా 2వేల నోట్ల కట్టల రూపంలోనే ఉంటుందిగా? ఇప్పుడా 2వేల నోటే లేకుండా పోతే? ప్రతిపక్ష పార్టీల ఖజానాకు చిల్లు పడినట్టేగా? అంతపెద్ద మొత్తంలో నోట్లు మార్పిడి చేయలేరుగా? దాచిన సొమ్మంతా పనికి రాకుండా పోయి పార్టీలు గిలగిలా కొట్టుకోవాల్సిందేగా? ఆ మేరకు బీజేపీకేగా లాభం? అనే చర్చ జరుగుతోంది.

అందరికంటే ఈ దెబ్బ కేసీఆర్‌కే గట్టిగా తగిలుతుందని అంచనా వేస్తున్నారు. విరాళాల పరంగా చూసుకున్నా.. బీఆర్ఎస్‌కు 218 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. అందులో గుప్త విరాళాలే అధికమని ఇటీవలే ఓ నివేదిక తేల్చింది. ఇదంతా ఆఫీషియన్ సొమ్ము మాత్రమే. ఇక అనధికారికంగా గులాబీ బాస్ దగ్గర లక్షల కోట్ల ధనం ఉందని ప్రతిపక్షాలు తరుచూ ఆరోపిస్తుంటాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలకు కేసీఆరే నిధులు అందిస్తున్నారంటూ ప్రచారం ఉంది. ఆ డబ్బంతా ప్రైవేట్ విమానాల్లో, సూటుకేసుల్లో తరలిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. అంటే, నగదు రూపంలోనే అన్నట్టుగా. పెద్ద మొత్తంలో నగదంటే 2వేల నోట్లేగా. సో, ఆ లెక్కన.. 2వేల నోట్ల రద్దుతో అందరికంటే బిగ్ షాక్, బిగ్ లాస్.. గులాబీ బాస్‌కే అనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ తర్వాత కాంగ్రెస్‌కే కటకట అని కూడా అంటున్నారు.


తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నాలుగు పెద్ద రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటీవల కర్నాటకలో విజయం తర్వాత హస్తం పార్టీ ఫుల్ జోష్ మీదుంది. అదే జోరులో ఈ నాలుగు స్టేట్స్‌కు కొట్టేయాలని డిసైడ్ అయింది. ఎలక్షన్లలో గెలుపుఓటములకు డబ్బు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2వేల నోట్లు బ్యాన్ చేయడంతో.. ‘చేతి’లో డబ్బులు లేక కిటకిట..కటకట.. తప్పకపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో విజయావకాశాలను ఈ ఒక్క నిర్ణయం అమాంతం మార్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు..అంటున్నారు.

మరి, బీజేపీకి కూడా ఇబ్బందిగా.. అనే అమాయక ఆలోచన అవసరం లేదు. ఎందుకుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. గతంలోనూ పాత పెద్ద నోట్ల సమయంలో పలువురు బడా బీజేపీ నేతలు ముందే నోట్లు మార్చేసుకున్నారని అన్నారు. ఇప్పుడూ ఇప్పటికే ఆ మార్పిడి జరిగిపోయుంటుందని కూడా అంటున్నారు. ఏదిఏమైనా.. 2వేల నోట్లు రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం.. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను షేక్ చేసే ఛాన్సెసే ఎక్కువ. ఎనీ డౌట్స్?

Related News

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Big Stories

×