EPAPER
Kirrak Couples Episode 1

Cock Fight: జల్లికట్టుకు ఓకే.. మరి, కోడి పందాలకు..?

Cock Fight: జల్లికట్టుకు ఓకే.. మరి, కోడి పందాలకు..?
cock fight

Cock Fight: జల్లి కట్టు, కంబల, ఎడ్లబళ్ల పోటీలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బాగానే ఉంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా జరుపుకునే కోడి పందేల పరిస్థితి ఏంటి? దీనిపైన ఉన్న సుప్రీం ఆంక్షలు తొలగుతాయా?


సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఇంటి ముందు రంగవల్లులు, కొత్త ధాన్యాలు, గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కీర్తనలు.. వీటన్నిటికంటే కోడి పందాల హడావుడి.

కోడి పందాలు ఆడటం చట్టరిత్యా నేరం అంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తారు. కానీ, పోలీసులకు భయపడి ఒక్క కోడి పందెం కూడా ఆగదు. అంతా అఫిషియల్‌గా సాగే అనఫిషియల్ వ్యవహారం. రాజకీయ నేతల కనుసన్నల్లో సాగుతుందు పందేరం. గోదావరి జిల్లాల్లో గ్రామగ్రామాణ బరులు గీస్తారు. పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జాతర. కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. కాక్ ఫైట్ మజా ఏమో కానీ.. పాపం ఆ కోళ్లను అలా హింసిస్తున్నారంటూ జంతుప్రేమికులు ఆవేదన. రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసుల హంగామా.


అయితే, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేయడంతో మన కోడిపందేలను కూడా అనుమతిస్తారా? అనే చర్చ మొదలైంది. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960 ను అమలు చేసినప్పటి నుంచి కోడిపందాలపై నిషేధం ఉంది. ఐతే గతంలో సుప్రీం కోర్టు… కోడి పందేలపై కాస్త సానుకూలంగా స్పందించింది. కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి 2018 జనవరిలో అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. కానీ కోడికి కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించడం సాధ్యం కాదు. కత్తి కట్టకుంటే.. ఏ కోడి ఓడిపోదు… అప్పడు అసలు పందెమే ఉండదనే వాదన వినిపిస్తోంది. కాబట్టి కోడి పందేలపై నిషేధం ఎత్తేయాలనే డిమాండ్ పెరుగుతోంది. జల్లికట్టు, కంబల, ఎడ్ల బళ్ల పోటీలకు ఇచ్చిన విధంగానే అనుమతి ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది.

Related News

TDP vs JANASENA: మేము ఉండగా మీ పెత్తనం ఏంటి ? పింఛన్ పంపిణీలో జనసేన నేతను అడ్డుకున్న టీడీపీ.. ఉద్రిక్తత

KA Paul: చర్చిలపై ప్రభుత్వ పెత్తనం లేదు.. ఆలయాలపై ఎందుకు? చంద్రబాబు, పవన్‌లపై కె.ఎ.పాల్ షాకింగ్ కామెంట్స్

AP Liquor: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తక్కువ ధరకే లిక్కర్!

Appsc new chairman: ఏపీపీఎస్సీ న్యూ ఛైర్మన్, వారికే ఛాన్స్

Tirumala laddu row: లడ్డూ వివాదం.. టెన్షన్‌లో వైసీపీ, సీబీఐ లేదా జ్యుడీషియల్? కెమికల్ ఇంజనీర్ల నిపుణలేమంటున్నారు?

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

Big Stories

×