EPAPER

Sri Bugul Venkateshwara Temple : కొండల్లో వెలిసిన గుబులు వెంకటేశ్వరుడు…

Sri Bugul Venkateshwara  Temple : కొండల్లో వెలిసిన గుబులు వెంకటేశ్వరుడు…


Sri Bugul Venkateshwara Temple : కొండల్లో వెలిసిన కోనేటి రాయుడు కొండంత అండ అందించేందుకు, తన ఉనికిని చాటేందుకు దేశంలో ఎన్నో క్షేత్రాల్లో వెలిశాడు. అలాంటి ఆలయాల్లో ఒకటి బుగుల్ వెంకటేశ్వరస్వామి టెంపుల్. వరంగల్ జిల్లా చిలపూర్ గుటపై ఆ గోవిందుడు కొలువుతీరాడు. అప్పులతో నిత్యం సతమతం అవుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వారు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుంటే చాలు కష్టాలు తీరినట్టే అంటారు. అప్పుల బాధ తీరాలంటూ ఆలయంలోని అఖండ దీపంలో నూనె వేసి దీపం వెలిగించిన వారికి త్వరలోనే ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం కుబేరుడి అప్పులు తీర్చలేక గుబులతో ఉన్న స్వామి ఇక్కడ వెలిశారని ఆరకంగానే బుగుల్ వెంకటేశ్వరస్వామి మారారని అంటారు. అందుకు నిదర్శనగా కొండ కింద స్వామి పాదాలే సాక్ష్య్యం

1400 సంవత్సరాల క్రితం స్వామి వారి ఉనికి బయటపడింది. హైదరాబాద్- వరంగల్ రహదారిలోనే చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ముగ్దమనోహరమైన స్వామి రూపం చూడముచ్చటగా ఉంటుంది. అప్పులు తీర్చమని భక్తులు చాలా మంది దేవళ్లుని వేడుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడి వస్తే చాలు బుగుల్ వెంకటేశ్వరస్వామి మహత్య్యాన్ని చూడొచ్చంటారు. ఇక్కడే ఒక అఖండ దీపం వెలిగించి అని పురాణాలు చెబుతున్నాయి. కొండపైకి వెళ్లేందుకు 300పైకిగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొంత భాగం వరకే మెట్లు ఉంటాయి. రాళ్లు, రప్పలతో నడుచుకుంటూ గుట్టపైకి ఎక్కాల్సి ఉంటుంది. కొంచెం కష్టమే అయినప్పటికీ స్వామిని తలుచుకుంటూ కొండపైకి చేరుకుంటూ ఉఁటారు భక్తులు. ఇక్కడ వెలిసిన ఆంజనేయస్వామి రూపం మరిచిపోలేం.


పచ్చదనం పరిచినట్టు ఊరంతా కనిపిస్తుంది. ప్రతీ సంవత్సరం పాల్గుణ శుద్ద సప్తమి రోజు నుంచి పాల్గుమ పౌర్ణమి వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ప్రతీ నెల శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారి మాసకళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ, కార్తీక మాసాలతోపాటు ధనుర్మాసంలో ప్రతీరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆలయం చుట్టు పక్కన పరిసరాలు ఎంతో సుందరంగా కనిపిస్తుంటాయి.

Related News

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

×