EPAPER

Technology: కాలుష్యాన్ని సొమ్ము చేసుకునే టెక్నాలజీ..

Technology: కాలుష్యాన్ని సొమ్ము చేసుకునే టెక్నాలజీ..


Technology: కాలుష్యం అనేది మనుషుల ప్రాణాలకు ఎంత ముప్పు కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని ఎంత అదుపు చేయాలని అనుకున్నా.. వారికి పూర్తిస్థాయిలో సక్సెస్ అందడం లేదు. అందుకే పర్యావరణవేత్తలు కూడా ప్రతీ ఒక్కరూ కాలుష్యం అదుపు చేయడానికి సాయం చేయాలని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ వ్యాపారవేత్తలు ఆలోచన మాత్రం వేరేలాగా ఉంది. వారు ఈ కాలుష్యం నుండి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టీల్ తయారీ వల్ల గాలి కాలుష్యం అనేది విపరీతంగా విడుదలవుతోంది. అందుకే కాలుష్యానికి హాని కలగకుండా గ్రీన్ స్టీల్ అనేది తయారు చేయాలని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నా.. దానికి ఇంకా చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ఈ స్టీల్ తయారీ నుండి వచ్చే కాలుష్యాన్ని లాభంలాగా మార్చుకోవాలి అనుకుంటున్నానని టెక్సాస్ సీఈఓ ప్రకటించారు. దానికోసమే కార్బన్ ఫ్రీ అనే టెక్నాలజీని తయారు చేశారు. కాలుష్యాన్ని పట్టుకోవడం కోసం ఇలాంటి ఒక టెక్నాలజీ తయారవ్వడం ఇదే మొదటిసారి.


కార్బన్ ఫ్రీ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక సిమెంట్ ప్లాంట్ నుండి బయటికి వస్తుంది. ఆ మిషీన్ నుండి బయటికి వచ్చే క్రమంలోనే కాలుష్యం అనేది బేకింగ్ సోడాలాగా మారుతుంది. అలా కాలుష్యం నుండి తయారు చేసిన బేకింగ్ సోడా ఇప్పటికే పలు దేశాల మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియను స్కైమైన్ అంటున్నట్టు తెలుస్తోంది. అయితే కాలుష్యం నుండి తయారయ్యే బేకింగ్ సోడా ఎలా ఉంటుందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నా.. ఇది ఫస్ట్ గ్రేడ్‌లో ఉంటుందని సీఈఓ మార్టిన్ కైగ్లే హామీ ఇచ్చారు.

ప్రస్తుతం బేకింగ్ సోడాను ఉపయోగించి రోజూ తినే ఆహార పదార్థాలను తయారు చేసుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలకు ఉన్న బేకింగ్ సోడా అవసరాలు తీర్చడం కోసం కార్బన్ ఫ్రీ టెక్నాలజీ ఉపయోగపడుతుందని మార్టిన్ చెప్తున్నారు. అంతే కాకుండా కార్బన్ ఫ్రీ ద్వారా ప్రపంచంలోని 10 శాతం కాలుష్యం తగ్గిపోయిన మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యానికి వారు చేరువలో కూడా ఉన్నామని బయటపెట్టారు.

Related News

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

×