EPAPER
Kirrak Couples Episode 1

KomatiReddy: కాంగ్రెస్‌లోకి రమ్మంటున్నారు.. చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ..

KomatiReddy: కాంగ్రెస్‌లోకి రమ్మంటున్నారు.. చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ..

KomatiReddy: తెలుసుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఆయన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే. అలాంటిది వేల కోట్ల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్‌ను వదిలి.. బీజేపీలో చేరారని అంటారు. మునుగోడులో పువ్వు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి మళ్లీ కనిపిస్తే ఒట్టు. ఏ బీజేపీ మీటింగ్స్‌లోనూ కనిపించట్లే. ఏ కాషాయ వేదికపైనా మాట్లాడట్లే. ఏమై ఉంటుంది? ఓటమితో కోమటిరెడ్డి పునరాలోచనలో పడ్డారా? అంటూ గుసగుసలు. అంతలోనే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విషయం సాధించింది. ఇక అంతే. రాజగోపాల్ మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్. నిజమేనా?


కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి బాలేదన్న మాట కాస్త వాస్తవమే. ఆయన చాలాకాలంగా కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం.. గెలిచిన ఆ కొన్నిసీట్లను కూడా కేసీఆర్ ఎగరేసుకుపోవడం.. సరైన నాయకత్వ లేక పార్టీ పాకుతుండటంతో.. కోమటిరెడ్డికి చికాకొచ్చింది. ఆలోగా రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో హస్తం నేతల్లో హుషారు పెరిగింది. రేవంత్‌ను కోమటిరెడ్డి బ్రదర్స్ థ్రెట్‌గా భావించారు. ఆ సమయంలో కేంద్ర బీజేపీ నుంచి వేల కోట్ల కాంట్రాక్ట్ ఆఫర్ రావడంతో.. కాషాయ గాలానికి ఈజీగా చిక్కారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి బిగ్ షాక్. ఆయన పార్టీని వీడినా.. కేడర్ మాత్రం కాంగ్రెస్‌ వెంటే నిలిచింది.

ఆ షాక్‌కు దిమ్మతిరిగిపోయింది కోమటిరెడ్డికి. తన రాజకీయ కోటలో తాను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం.. తెలంగాణలోనూ హస్తం దూకుడు మీదుండటంతో.. ఆయన రక్తంలోని కాంగ్రెస్ మళ్లీ రారమ్మంటున్నట్టు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.


కాంగ్రెస్‌లో చేరడంపై లేటెస్ట్‌గా క్లారిటీ ఇచ్చారు కోమటిరెడ్డి. కర్నాటక ఎన్నికల తర్వాత తనను మళ్లీ కాంగ్రెస్‌లోకి రమ్మని పిలుస్తున్నారని చెప్పారు. అయితే, తాను పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని లేదన్నారు. కేంద్రంలో అధికారంలో లేకుండా, బలమైన నాయకత్వం లేకుండా.. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదన్నారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులు తయారయ్యాయంటూ మరింత అక్కస్సు వెళ్లగక్కారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

అయితే, రానురానంటున్నారు కానీ.. ఎన్నికల నాటికి మరింతగా కాంగ్రెస్ గాలి వీస్తే.. అప్పుడు కూడా రానంటారా? రాకుండా ఉంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా!

Related News

Janasena Party: బాలినేని అండతో జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Sahithi Infrastructure Fraud: ల‌క్ష్మీనారాయణ లీల‌లు.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Big Stories

×