EPAPER

New Planet:- కొత్త గ్రహం గుర్తింపు.. ఎంత ప్రయత్నించినా వీడని మిస్టరీ…

New Planet:- కొత్త గ్రహం గుర్తింపు.. ఎంత ప్రయత్నించినా వీడని మిస్టరీ…


New Planet:- ఇప్పటికే అంతరిక్షం గురించి ఆస్ట్రానాట్స్ ఎన్నో విధాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనల్లోనే వారు ఎన్నో కొత్త విషయాలను, మిస్టరీలకు సమాధానాలను, గ్రహాలను కనుగొన్నారు. అయితే ఇప్పటికీ వారు కనిపెట్టిన కొన్ని గ్రహాలు కూడా మిస్టరీలాగానే ఉంది. అలాంటి ఒక గ్రహం గురించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ గ్రహం గురించి వారు ఆశ్చర్యపోయే విషయాలు బయటికి వచ్చాయి.

మామూలుగా మిస్టరీగా కనుగొన్న గ్రహం ఎక్కువ వేడిగా ఉంటుందని ముందుగా నిర్ధారణకు వస్తారు. అయితే కొన్నాళ్లు క్రితం కూడా కనుగొన్న గ్రహం అలాగే ఉంటుందని వారు అనుకున్నారు. కానీ తాజాగా అది అంత వేడిగా ఉండదని, పైగా వేరే ఏ గ్రహం లేనంత మెరుపుతో ఉంటుందని తెలుసుకున్నారు. ఈ గ్రహాన్ని ఆస్ట్రానాట్స్ కనిపెట్టినప్పటి నుండి మిని నెప్ట్యూన్ అని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే ఈ గ్రహం యొక్క లక్షణాలు కొంచెం నెప్ట్యూన్‌తో మ్యాచ్ అవుతున్నట్టు వారు గమనించారు.


ఈ మిస్టరీ గ్రహాన్ని కనిపెట్టి దాదాపు ఒక దశాబ్దం అయ్యింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహం గురించి మరికొన్ని విషయాలు బయపడ్డాయి. ఇది ఒక స్టార్ చుట్టూ తిరుగుతుందని టెలిస్కోప్ ద్వారా బయటపడింది. ఈ గ్రహానికి జిజే 1214బీ అని పేరుపెట్టారు. ఇది భూమికంటే పెద్దదే అయినా.. సోలార్ సిస్టమ్‌లో ఉండే ఐస్, గ్యాస్ గ్రహాలకంటే చిన్నదని తెలుస్తోంది. అయితే మిని నెప్ట్యూన్స్, సూపర్ ఎర్త్స్ అని పిలవబడే ఇలాంటి మిస్టరీ గ్రహాలు సోలార్ సిస్టమ్‌లో కరువేమీ కాదని నిపుణులు చెప్తున్నారు.

జీజే 1214బీ అనే గ్రహం రకం మాత్రం ఇంతకు ముందు ఎప్పుడూ కనిపెట్టలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి ఇది 48 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్రహంలో చాలా రహస్యాలు దాగున్నాయని, ఇవి బయటపడడానికి సమయం పడుతుందని తెలిపారు. ఇప్పటికీ దీని వాతావరణం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక స్టార్ నుండి పాస్ అయినప్పుడు గ్రహం గురించి తెలుసుకోవడం సులభం అని, కానీ జీజే గ్రహం.. స్టార్ నుండి పాస్ అయినా కూడా దానిలో మరిన్ని రహస్యాలు దాగున్నాయని బయటపెట్టారు. అయినా దీనిని ఛాలెంజ్‌గా తీసుకొని శాస్త్రవేత్తలు ముందుకెళ్తున్నారు.

Related News

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

×