EPAPER

Brain Rhythm:- మూడ్‌ను మార్చగలిగే బ్రెయిన్ రిథమ్…

Brain Rhythm:- మూడ్‌ను మార్చగలిగే బ్రెయిన్ రిథమ్…


Brain Rhythm:- ఒక్కొక్కసారి మన మూడ్ ఎందుకు ఎలా మారుతుందో మనకు కూడా క్లారిటీ ఉండదు. ఈరోజుల్లో ముఖ్యంగా ఇలాంటి సమస్య టీనేజర్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. టీనేజ్‌లో ఉన్నవారు, యూత్‌లో ఉన్నవారు ఎక్కువగా ఈ మూడ్ స్వింగ్స్‌కు గురవుతున్నట్టు నిరూపణ అయ్యింది. అయితే కొంతమంది తమ మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాని వెనుక బ్రెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

గుండెకు ఎలాగైతే లబ్ డబ్ అని రిథమ్ ఉంటుందో.. బ్రెయిన్‌కు కూడా అలాంటి రిథమే ఉంటుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. బ్రెయిన్‌లోని సిగ్నల్స్‌లో మార్పులు చేయడం వల్ల, వాటిని సెట్ చేయడం వల్ల డిప్రెషన్ నుండి దూరంగా ఉండవచ్చని ఎలుకల మీద చేసిన పరీక్షల్లో తేలింది. న్యూరాన్స్ అనేవి మెదడు నుండి సమాచారాన్ని పంపడానికి ఉపయోగపడతాయి. ఇదంతా ఒక జాయింట్ యాక్టివిటీగా బ్రెయిన్ పనిచేసేలా చేస్తుంది. బ్రెయిన్‌లో ఉన్న అలాంటి ఒక రిథమ్‌ను గామా అంటారు.


గామా అనే రిథమ్ మెదడులో సెకనుకు 30 సార్లు, అప్పుడప్పుడు అంతకంటే ఎక్కువసార్లు కూడా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ రిథమ్ అనేది ఎమోషన్స్‌ను కంట్రోల్ చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలా బ్రెయిన్‌లో ఉన్న ఒక్కొక్క రిథమ్ ఒక్కొక్క పని చేస్తుంది. అలాగే గామా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేస్తుందని అంటున్నారు. అందుకే గామా అనేది ఎలా పనిచేస్తుంది అని ఎలుకపై ప్రయోగాలు చేసి చూశారు. డిప్రెషన్ లాంటి విషయాలను గామా ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసుకున్నారు.

గామాలోని సిగ్నల్స్ మార్పులను బట్టి డిప్రెషన్‌ను తగ్గించవచ్చని, మూడ్‌ను మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని పెంచడం కోసం కూడా ఈ గామా సిగ్నల్స్‌ను ఉపయోగించి చికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే అలాంటి సమస్యలకు గామా సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపడుతున్నారు.

Related News

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

iPhone SE 4 : ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్.. డిస్ ప్లే, ఫీచర్స్ కిర్రాక్ బాస్

Airtel Xstream AirFiber : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ తో వచ్చేసిన ఎయిర్టెల్

Samsung Galaxy S24 FE vs Samsung Galaxy S23 FE : ఈ రెండింటిలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా? ధర, ఫీచర్స్ ఇవే!

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

×