EPAPER

Custody Review : కస్టడీ హిట్టా.. ? ఫట్టా..? నాగచైతన్య మెప్పించాడా..?

Custody Review : కస్టడీ హిట్టా.. ? ఫట్టా..? నాగచైతన్య మెప్పించాడా..?

Custody Review :నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ ప్రభు కావడంతో అంచనాలు పెరిగాయి. అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి పెద్ద నటులు ఈ మూవీలో నటించడంతో హైప్ మరింత పెరిగింది. భారీ అంచనాలతో విడుదలైన కస్టడీ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..? ఈ విషయాలు తెలుసుకుందాం..


శివ అంటే నాగచైతన్య సిన్సియర్ కానిస్టేబుల్ . సీబీఐ ఆఫీసర్ అంటే సంపత్ , సీఎం అండతో బతికే రౌడీషీటర్ అంటే అరవింద్ స్వామి, ఒక రౌడీ పోలీస్ ఆఫీసర్ అంటే శరత్ కుమార్. ఈ నాలుగు పాత్రలు మధ్య జరిగే కథ ఇది. నాగ చైతన్య లవర్ కృతిశెట్టి. ఆమెకు వెన్నెల కిషోర్ తో నిశ్చితార్ధం అవుతుంది. హీరో ఆమెను ఎలా దక్కించుకుంటాడు? ఇందంతా ఒక ట్రాక్.

ఈ సినిమాలో హుక్ పాయింట్ ఏంటంటే సీబీఐ ఆఫీసర్ రౌడీ షీటర్ ను ఎందుకు తరుముతున్నాడు? సీఎంకు ఆ రౌడీషీటర్ మధ్య సంబంధమేంటి? క్లైమాక్స్ లో ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఫస్టాఫ్ పాత్రల పరిచయాలతో కొనసాగుతుంది. అరవింద్ స్వామి పాత్రతో కథ మొదలవుతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ అంత ఆసక్తిగా లేదనిపిస్తుంది. సెకండాఫ్ లో యాక్షన్ పార్టే ఎక్కువగా ఉంది. క్లైమాక్స్ కూడా మాములుగానే ముగుస్తుంది.


టెక్నికల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగుంది. సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ సూపర్ అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. కెమెరా వర్క్ బాగున్నా ఎడిటింగ్ పదును తగ్గింది. రిపీటెడ్ గా ఒకే తరహా సీన్స్ వచ్చాయియ. యువన్ శంకర్, ఇళయరాజా మ్యూజిక్ మ్యాజిక్ చేయలేదు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అంతగా ఆకట్టుకోలేదు.

నాగచైతన్య సీరియస్ క్యారెక్టర్ లో ఓకే అనిపించాడు. హీరోయిజం పెద్దగా కనిపించలేదు. కృతీశెట్టి పక్కింటమ్మాయి టైపులో సింపుల్ గా పాత్రకు తగ్గట్టుగా నటించింది. మరో కథానాయిక ఆనంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతిథి పాత్రలా మెరిసింది. అరవింద్ స్వామి పాత్రకు బిల్డప్ బానే ఇచ్చినా.. క్యారెక్టర్ లో డెప్త్ లేదు. ఈ పాత్రే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తుంది. శరత్ కుమార్ విలన్ గా మెప్పించాడు. ముఖ్యమంత్రిగా కనిపించిన ప్రియమణికి బిల్డప్ షాట్స్ ఫుల్ గా ఉన్నాయి. కానీ ఆ పాత్ర నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ పేలలేదు. రాంకీ, జయసుధ లాంటి పెద్ద నటులు తక్కువ నిడిపి ఉన్న పాత్రల్లో కనిపించారు. కథ, కథనం, డైలాగ్ ఇలా ఏ విభాగంలోనూ సరైన పనితీరు కనిపించలేదు. కస్టడీ చూసినవాళ్లను బాగా కష్టపెట్టిందని చెప్పుకోవాలి.

నటీనటులు : నాగచైతన్య, అరవింద్ స్వామి, శరత్ కుమార్, కృతిశెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్
కెమెరా : కదిర్
ఎడిటింగ్ : వెంకట్ రాజన్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
విడుదల తేదీ : 12 మే 2023

Related News

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Big Stories

×