EPAPER

IPL : జైస్వాల్ విధ్వంసం.. కోల్ కతా పై రాజస్థాన్ ఘన విజయం..

IPL : జైస్వాల్ విధ్వంసం.. కోల్ కతా పై రాజస్థాన్ ఘన విజయం..

IPL Match Updates(KKR vs RR) : యశస్వి జైస్వాల్ మరోసారి వీరవిహారం చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 13.1 ఓవర్లలోనే రాయల్స్ చేధించింది. జైస్వాల్ (98 నాటౌట్, 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సులు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సంజు శాంసన్ ( 48 నాటౌట్, 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) తో కలిసి రెండో వికెట్ కు అజేయంగా 121 పరుగులు జోడించాడు. కోల్ కతా బౌలర్లు అందరూ విఫలమయ్యారు. రాజస్థాన్ బ్యాటర్ బట్లర్ (0) రనౌట్ గా వెనుదిరిగాడు.


అంతకు ముందు మొదటి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ నితీశ్ రాణా (22) మినహా మిగతా బ్యాటర్ల ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. దీంతో కోల్ కతా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.

రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్ కు 2 వికెట్లు దక్కాయి. సందీప్ శర్మ, అసిఫ్ తలో వికెట్ తీశారు. అద్బుతంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. తాజా పరాజయంతో కోల్ కతా ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారాయి.


Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×