EPAPER

Pawan Kalyan: పవన్ క్లారిటీతో ఉన్నారా? కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అంతా ఆ 30 కోసమేనా?

Pawan Kalyan: పవన్ క్లారిటీతో ఉన్నారా? కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అంతా ఆ 30 కోసమేనా?
Pawan-kalyan

Pawan Kalyan Latest News(Andhra Pradesh Political News): సీఎం పదవిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. అర్థమై అర్థంకానట్టు.. ఉన్నాయంటున్నారు. 30-40 సీట్లుంటే చక్రం తిప్పేవాడినంటారు. అంతలోనే ముఖ్యమంత్రి పదవిని కండీషన్లు పెట్టి అడిగలేమన్నారు.


తనను సీఎం చేయమని టీడీపీనో, బీజేపీనో అడగనని అన్నారు. మళ్లీ తన సత్తా ఏంటో చూపించే సీఎం సీటు అడుగుతానని స్పష్టం చేశారు.

సీఎం పదవి వరించి రావాలి కానీ.. కోరుకుంటే రాదన్నారు. ఆ తర్వాత బలాన్ని బట్టే సీఎం పోస్టు వస్తుందంటూ మరో స్టేట్‌మెంట్ ఇచ్చారు.


పొత్తులకు సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కర్నాటకలో కుమారస్వామిలా కింగ్ అయ్యేవాడినని చెబుతున్నారు.

జనసేనకు పలుచోట్ల 30శాతం ఓట్ షేరింగ్ ఉందని.. యావరేజ్‌గా రాష్ట్రంలో 18 శాతం ఓటింగ్ పడుతుందని అంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా.. 175 స్థానాల్లో జననేనకు రావాల్సిన సీట్లు 31 మాత్రమే. మరి, చంద్రబాబు జనసేనకు ఆ మాత్రం సీట్లు కూడా ఇవ్వనంటున్నారా? తమకు గౌరవ ప్రదమైన సంఖ్యలో స్థానాలు ఇవ్వాల్సిందేనని పవన్ కల్యాణ్ పట్టుబడుతోంది ఆ 31 సీట్ల కోసమేనా? తనకు 30 నుంచి 40 సీట్లు వస్తే.. కుమారస్వామిలా సీఎం సీటు డిమాండ్ చేసేవాడినని సింబాలిక్‌గా చెప్పారా? ఆ భయంతోనే.. ఎక్కడ పవన్‌ ముఖ్యమంత్రి పీఠం అడుగుతారనే ముందుజాగ్రత్తతోనే చంద్రబాబు పొత్తుల వ్యవహారం ముందుకు సాగనీయడం లేదా? అనే చర్చ నడుస్తోంది.

మధ్యలో బీజేపీ రోల్ అత్యంత కీలకం. మీరు మీరు సీట్లు పంచుకుంటే మా సంగతేంటి? అనేది బీజేపీ ప్రశ్న. ఆ పార్టీకి ఎన్నిసీట్లు ఇస్తారు? పవన్‌కే 30 సీట్లు వచ్చేలా లేకపోతే.. ఇక బీజేపీకి ఏమిస్తారు? ఓట్ షేరింగ్ లెక్క ప్రకారం బీజేపీకి ఏ రెండో మూడో ఇస్తే అదే ఎక్కువ అనుకుంటారు. మరి, ఆ రెండు మూడు సీట్ల కోసం కమలం పార్టీ.. తమ రహస్య స్నేహితుడిని వదులుకుంటుందా? జగన్‌తో బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రాబ్లమ్ ఏముంది? సొంతగా సింగిల్ సీటు కూడా గెలిచే సత్తా లేని బీజేపీ.. ఎవరినో సీఎంను చేసేందుకు ఎందుకు ముందుకొస్తుంది? జగన్‌ను గద్దె దించాలనే పంతం, పట్టుదల చంద్రబాబు, పవన్‌లది. మరి, వారికున్నంత డిజైర్ కమలదళానికి ఉంటుందా? పవన్ కోసం కూటమి కడుతుందా? జనసేనాని ఎంతగా నచ్చజెప్పుతున్నా.. అందుకే బీజేపీ ట్రయాంగిల్ లవ్‌కు నో చెబుతోందా? ఇలా అనేక ప్రశ్నలు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×