EPAPER

Pawan Kalyan: పవన్ వస్తున్నారని.. జగన్ పరేషాన్ అవుతున్నారా?

Pawan Kalyan: పవన్ వస్తున్నారని.. జగన్ పరేషాన్ అవుతున్నారా?
pawan jagan

Pawan Kalyan Latest News(AP Political Updates): అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన ధాన్యం నీటిపాలైంది. అన్నదాతలను పరామర్శించడానికి పవన్ కల్యాణ్ పయనమయ్యారు. జిల్లాకు జనసేనాని వస్తున్నారని తెలిసి.. అధికారులు అలర్ట్ అయ్యారు. రాత్రివేళ ఆగమాగం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే…


పి.గన్నవరం మండలం రాజుపాలెంలో జరిగిందీ ఘటన. తడిసిన ధాన్యాన్ని రాత్రిపూట సేకరించారు అధికారులు. పైనుంచి ఆదేశాలు రావడంతో.. అప్పటికప్పుడు చిమ్మచీకట్లో సంచుల్లోకి ధాన్యాన్ని లోడ్ చేశారు. రాత్రి సమయం కావడంతో కూలీలెవరూ అందుబాటులో లేరు. అయినా, అధికారులు వెనక్కి తగ్గలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ తడిసిన ధ్యాన్యం అంతా గ్రామం నుంచి తరలించేయాలని ఫిక్స్ అయ్యారు. కూలీలు లేకపోవడంతో.. VRA,VRO, VAOలే కూలీలుగా మారారు. తలో బస్తా ఎత్తుకొని.. ట్రాక్టర్‌లో తరలించారు.

ఎంత విచిత్రం. ఇన్నాళ్లుగా తడిసిన ధాన్యం కొనండి మహాప్రభో అంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోలేదు కానీ.. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి.. రాత్రి చీకట్లో ధాన్యం సేకరించడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసేనానికి భయపడే.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే.. అధికారులు ఇలా హడావుడిగా ధాన్యం సేకరించారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.


గతంలోనూ ఇలానే జరిగింది. గుంతలు పడి, కంకర తేలిన రోడ్ల దుస్థితిని చూసేందుకు వస్తున్నానని పవన్ కల్యాణ్ ముందే ప్రకటించారు. ఆయన వచ్చే సరికల్లా.. ఆ ప్రాంతంలో కొత్త రోడ్లు వేసి.. గోతులు లేకుండా చేశారు అధికారులు. అప్పట్లో ఈ విషయం బాగా హైలైట్ అయింది.

వరుస సంఘటనలు చూస్తుంటే జనసేనానికి జగన్ దడుసుకుంటున్నారా? పవన్‌కు పేరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అనే అనుమానం తలెత్తుతోంది. చంద్రబాబు వస్తే ఇంత హడావుడి చేయట్లేదు సర్కారు. ప్రతిపక్ష నేతైనా ఆయన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు. ర్యాలీలు, సభలను అడ్డుకుంటున్నారే కానీ.. ఇలా సమస్యలు లేకుండా పనులు మాత్రం చక్కబెట్టిన ఉదంతాలు లేవు. కానీ, పవన్ కల్యాణ్ విషయంలో అలా కాదు.

జనసేనాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్‌పై బాగా ఇంపాక్ట్ చూపించే ఇష్యూస్‌నే ఎంచుకుంటున్నారు. ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయి.. ప్రజలంతా అవస్థలు పడుతున్నారు.. ఆ సమస్యను పవన్ టేకప్ చేస్తే.. పబ్లిక్ సపోర్ట్ అంతా పవన్‌కే. వర్షాలు కురిశాయి. ధాన్యం తడిచింది. జనసేనాని పరామర్శకు వస్తే.. రైతులకు కాస్త ఓదార్పు. అందుకే, జగన్ భయపడుతున్నారని అంటున్నారు. పవన్ టేకప్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ.. వైసీపీకి పొలిటికల్‌గా డ్యామేజ్ చేసే అంశాలే కావడంతో అధికారపార్టీ కలవరం పడుతోంది. దాని ఫలితమే.. పవన్ వస్తున్నారంటే.. ముందస్తు హడావుడి చేస్తోందని తెలుస్తోంది.

పవన్‌ను చూస్తేనే బెదురుతున్న జగన్.. ఇక జనసేన, టీడీపీ కలిస్తే..? ఇప్పటికే పలుమార్లు పవన్, చంద్రబాబులు భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. వారి మీటింగ్.. వీరికి షాకింగ్. అందుకే, పొత్తు సాధ్యం కాకూడదనే నిత్యం వైసీపీ నేతలు ఆ ఇద్దరు నేతలను తెగ టార్గెట్ చేస్తుంటారు. ఆ రెండు పార్టీల పొత్తులపై పంచ్‌లు, సెటైర్లు వేస్తుంటారు. చంద్రబాబు కంటే పవన్‌ను చూస్తేనే.. అధికారపార్టీ ఎక్కువ బెదురుతున్నట్టు కనిపిస్తోంది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×