EPAPER

Political Leaders: హేమాహేమీలు ఏడుస్తున్నారెందుకు? రాజకీయం రూటు మారుతోందా?

Political Leaders: హేమాహేమీలు ఏడుస్తున్నారెందుకు? రాజకీయం రూటు మారుతోందా?
political leaders crying

Political Leaders News: ఎప్పుడైనా అనుకున్నామా చంద్రబాబు అంతటి నేత బోరున ఏడుస్తారని..


ఎప్పుడైనా ఊహించామా.. చిచ్చరపిడుగులా చెలరేగే రేవంత్‌రెడ్డి కళ్లల్లో నీళ్లు చూస్తామని..

పవర్‌ఫుల్ లీడర్ బాలినేని.. అలా కంటతడి పెట్టడం మామూలు విషయమా..


తరుచూ వివాదాల్లో ఉండే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీళ్లు పెడతారని అనుకున్నామా..

కానీ, ఇవన్నీ నిజంగా నిజం. రాజకీయాల్లో ఇలాంటి సీన్లు అనూహ్యం. ఎందుకీ విపరీతం? ఉద్దండ నాయకులు ఇంతలా ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? వారికంట కన్నీళ్లు పెట్టించేలా.. రాజకీయాలు దిగజారాయా? దూకుడు పెంచాయా?

రాజకీయాల్లోకి వచ్చారంటేనే వారు కాస్త ఖతర్నాక్ అయిఉంటారు. అందులోనూ, స్టేట్‌వైడ్ పాపులారిటీతో, టాప్ లీడర్‌గా ఎదిగారంటే.. వారెంత స్ట్రాంగ్ లీడరో ఊహించుకోవచ్చు. అంతటి స్థాయి ఉన్న నాయకులు సైతం.. చిన్నపిల్లాడిలా ఏడ్చారంటే..! ఇది పక్కా ఆలోచించాల్సిన విషయమే.

చంద్రబాబే ఏడ్చారంటే..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 14 ఏళ్లు ముఖ్యమంత్రి. అంతేకాలం ప్రతిపక్ష నేత. అలాండి చంద్రబాబు.. చిన్నబాబులా మీడియా కెమెరాల సాక్షిగా వెక్కివెక్కి ఏడ్వడం అప్పట్లో తీవ్ర కలకలం. అసెంబ్లీలో తన కుటుంబాన్ని గురించి వైసీపీ సభ్యులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారనే ఆవేదన.. ఆయనలో తన్నుకొచ్చింది. మీడియా సమావేశం అనే విషయాన్ని మరిచేలా చేసింది. నోట మాట రాలేదు. కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కొన్ని నిమిషాల పాటు అలా బోరున ఏడుస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనే. కానీ, ఆ విమర్శ అలాకాదు. అన్నేళ్ల కుటుంబ గౌరవాన్ని మంటగలిపేలా ఉండటంతో.. ఆయన సైతం మామూలు మనిషిలా గుక్కపెట్టి ఏడ్చారు. ఆ దృశ్యం వైసీపీ వాళ్లను సైతం చలించేలా చేసినట్టుంది. బహుషా అందుకేనేమో.. అక్కడితో ఆ అసంబద్ధ వ్యాఖ్యలకు పుల్‌స్టాప్ పెట్టారు. బాబు ఏడుపు.. పెద్ద నోరున్న నేతల నోరు మూయించిందనే చెప్పాలి.

రేవంత్ కంట కన్నీరు కారడమా..!
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ సైతం అంతే అనూహ్యం. ఆమాత్రం దానికే ఏడుస్తారా? అనిపించొచ్చు కొందరికి. కానీ, రేవంత్ చెప్పినట్టు జైల్లో చిప్పకూడు తింటే తెలుస్తుంది ఆ నొప్పి ఎట్లుంటదో. కేసీఆర్‌నై ప్రాణం పెట్టి కొట్టాడుతుంటే.. ఆస్తులన్నీ అమ్ముకునైనా కేసీఆర్‌ను గద్దె దించాలని పోరాడుతుంటే.. ఈటల మాత్రం కేసీఆర్ నుంచి కాంగ్రెస్ డబ్బులు తీసుకుందని ఆరోపించడంతో రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యారు. అప్పటివరకూ ఉక్కుమనిషిలా ఉన్న ఆయన.. సడెన్‌గా కన్నీళ్లు పెట్టడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఆ సందర్భంగా ఈటలపై కొన్ని పదాలు జారడంపై విమర్శలు వచ్చినా.. రేవంత్ కన్నీళ్లు అంతకుమించి ప్రభావం చూపాయి. ఎంతటి స్ట్రాంగ్ లీడర్ అయినా.. వారికీ మనోభావాలు, ఆత్మాభిమానం మెండుగా ఉంటాయని.. దాన్ని హర్ట్ చేస్తే.. కన్నీళ్లు జరజరా జారుతాయని రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌తో తెలిసొచ్చింది.

వాసన్నా.. ఊరుకోన్నా..!
ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతం కూడా ఇంతే. జగన్‌కు వీరవిధేయుడిగా ఉన్నారాయన. అందులోనూ బంధుత్వం కూడా ఉందాయే. అయినా, బావ వైవీ సుబ్బారెడ్డితో ఆధిపత్యపోరుకు బలి అవుతున్నాననే ఆవేదన ఆయనది. మంత్రి పదవి పాయే. పార్టీలో ప్రాధాన్యం లేదాయే. కనీసం డీఎస్పీ పోస్టింగైనే వేయించుకోలేకపోయే. అందుకే బాగా హర్ట్ అయ్యారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా అదే సమయంలో తన స్థాయికి ఏమాత్రం తగని.. తన రాష్ట్రమే కాని.. తెలంగాణకు చెందిన గోనె ప్రకాశరావు తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. టీడీపీ, జనసేనల నుంచి నిత్యం విమర్శలు ఎదుర్కొనే వాసన్న.. గోనె ఆరోపణలను మాత్రం భరించలేకపోపయారు. ఆయన ఇగో దెబ్బతింది. తన ప్రత్యర్థులే గోనెతో అలా మాట్లాడించారని.. తన పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారైందని చలించిపోయారు. మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్ట్.. గోనె ప్రకాశరావు కామెంట్లకే బాలినేని ఏడ్చారని అనుకోలేం. జిల్లాలో కొన్నాళ్లుగా సాగుతున్న కోల్డ్‌వార్, జగన్ దగ్గర తగ్గిన ప్రాధాన్యతతో.. తీవ్ర మనోవేదనకు లోనైన బాలినేని.. అలా కన్నీటిపర్యంతం అయ్యారని అంటున్నారు.

ముత్తిరెడ్డి ముచ్చట..!
ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది మరోటైప్ కన్నీళ్లు. కన్న కూతురే ఆయనపై పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. తమ కుటుంబంలోని ఆస్థి గొడవలను.. తన ప్రజాజీవితానికి ఆపాదించడం సరికాదన్నారు. ఎన్నికల ముందు కావాలనే తన మనోస్థైర్యం దెబ్బతీసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందారు. మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు.

ఇటీవల కాలంలో ఈ నలుగురు ఇలా కంటతడి పెట్టుకున్న ఘటనలు.. రాజకీయ నేతల్లోని సున్నితత్వాన్ని, భావోద్వేగాలను ఆవిష్కరిస్తోంది. ఈ నాలుగు ఎపిసోడ్‌లు మీడియా సాక్షిగా జరగడం యాదృచ్చికమే..నా?

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×