EPAPER

Mysterious Spacecraft:- చైనా మిస్టర్ స్పేస్‌క్రాఫ్ట్.. 9 నెలల తర్వాత భూమిపైకి..

Mysterious Spacecraft:- చైనా మిస్టర్ స్పేస్‌క్రాఫ్ట్.. 9 నెలల తర్వాత భూమిపైకి..


Mysterious Spacecraft:- శాస్త్రవేత్తలు చేసే ప్రతీ ప్రయోగం సక్సెస్ అవ్వాలన్న ఆశతోనే చేస్తారు. కానీ అందులో అన్ని సక్సెస్ అవ్వవు. ఒకొక్కసారి శాస్త్రవేత్తల పొరపాటు ఏమీ లేకపోయినా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆస్ట్రానాట్స్‌ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటూ ఉంటారు. వారు తయారు చేసిన మెషీన్స్ ఒక్కొక్కసారి దారుణంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా ఫెయిల్ అయిన ఒక చైనా మెషీన్.. చాలాకాలం తర్వాత మళ్లీ ఆస్ట్రానాట్స్ కంటపడింది.

తొమ్మిది నెలల క్రితం అంతరిక్షానికి ఎగిరిన చైనాకు సంబంధించిన స్పేస్‌క్రాఫ్ట్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ జిక్వాన్ లాంచ్ సెంటర్‌కు తిరిగొచ్చింది. ఇదివరకు కూడా ఇలాంటి ఒక స్పేస్‌క్రాఫ్ట్ ఆకాశానికి ఎగిరినప్పుడు ఇలాగే కొన్నాళ్లు కనిపించకుండా మాయమయిపోయింది. కానీ దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువరోజులు అంతరిక్షంలో ఉందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అయితే ఈ స్పేస్‌క్రాఫ్ట్ చైనా నుండే ఎగిరినా కూడా దీని వివరాలు ఇప్పటికీ చైనీస్ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు.


ప్రస్తుతం ఈ స్పేస్‌క్రాఫ్ట్ గురించి బయటపెట్టడానికి చైనీస్ శాస్త్రవేత్తలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. కానీ చైనా మీడియా తెలిపినదాని ప్రకారం ఈ స్పేస్‌క్రాఫ్ట్ అనేది రీయూజెబుల్ అని తెలుస్తోంది. పైగా ఇది మనుషులతో సంబంధం లేని స్పేస్ వెహికిల్ అని కూడా చైనా మీడియా ప్రకటించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పోరేషన్ అనేది ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేసిందని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎగరగానే ఇది సక్సెస్ అయిందని చైనా శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకున్నట్టు తెలుస్తోంది.

2020 సెప్టెంబర్‌లో తయారైన ఈ స్పేస్‌క్రాఫ్ట్.. అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ ఎక్స్ 37బీ లాగానే ఉంటుందని సమాచారం. బోయింగ్ ఎక్స్ 37బీ కూడా రీయూజెబుల్ అని, అది కూడా మనుషులు అవసరం లేని స్పేస్ వెహికిల్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే చైనాకు చెందిన ఈ మిస్టరీ ఎయిర్‌క్రాఫ్ట్ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశ శాస్త్రవేత్తలు ఇది అడ్వాన్స్ టెక్నాలజీతో తయారయ్యిందని, శత్రువులపై దృష్టిపెట్టడానికే దీనిని ప్రత్యేకంగా తయారు చేశారని అనుమానిస్తున్నారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ గురించి చైనీస్ శాస్త్రవేత్తలు స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Tags

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×