Traditional Pooja :- మనకు ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువ ఆడవారి చుట్టూనే తిరుగుతాయి. కుటుంబ సంక్షేమం కోసం , అయిదోతనం కోసం ఇలాంటి ఎన్నో కోరికలు ఫలించడానికి వ్రతాలు ఉంటాయి. అయితే మనకు తెలిసిన వ్రతాల్లో ఎక్కువ శాతం మహిళల కోసమే కనిపిస్తాయి. నియమాలు పాటిస్తూ చేసేదే వ్రతం. నియమంగా పెట్టుకుని చేసేది ఏదైనా వ్రతమే. ఫలానా సమయానికి లేవాలి, ఫలానా తిండి తినాలి, ఫలానా సమయాన అక్కడికి వెళ్లాలనుకుని పని పూర్తి చేయడం ఇలా ఏదైనా నియమంగా పెట్టుకుని చేసేది వ్రతమే. ఏ వ్రతమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకొనేది లేదు.
ఆడవారి కోసం అన్నేసి వ్రతాలు ఉన్నా..మగవారి కోసం ఒకే ఒక్క వ్రతం ఉంది. అదే మౌన వ్రతం. కుంతీ దేవి మౌనంగా దాచిన కర్ణుడి రహస్యం వల్ల మహా భారతం జరిగింది . ఒక సందర్భంలో కర్ణుడు ధుర్యోధనుడి మించి ప్రవర్తిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కర్ణుడు దూకుడు ఊహించలేని విధంగా ఉంటుంది. బీరాలు పలికి చివరకి యుద్ధం వరకు తీసుకెళ్తాడు.ఆనాడు కర్ణుడు మౌనంగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.
వాస్తవానికి సాలగ్రామాలకు మగవారు మాత్రమే తాకాలని శాస్త్రం చెబుతోంది. సాలగ్రామ అర్చన వారు మాత్రమే చేయాలి. సాలగ్రామ, శివుడ్ని తాకి స్పృశించి హారతి , అర్చన అన్నీ వీటిని మాత్రమే పూజించాల్సింది మగవారు మాత్రమేనని స్పష్టంగా విశదీకరించింది.
సాలగ్రామ శివుడ్ని తాకితే ఒళ్లు జలదరిస్తుంది. ఇది చాలా మందికి అనుభవపూర్వకంగా కలిగిన తెలిసిన విషయం. షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అందులో విద్యుదయ స్కాంత శక్తిలాంటి ప్రవహిస్తుంది. అందువల్లే అలా అనిపిస్తుంది. సాలగ్రామ పూజ, శివలింగార్చన పూజలు పురుషులు మాత్రమే చేయమని శాస్త్రం చెప్పడానికి కారణమిదేనని అంటారు.