EPAPER
Kirrak Couples Episode 1

Ponguleti: పొంగులేటి దారేటి?.. విపక్షపార్టీలతో మైండ్‌గేమ్!.. రండి బాబూ రండి..

Ponguleti: పొంగులేటి దారేటి?.. విపక్షపార్టీలతో మైండ్‌గేమ్!.. రండి బాబూ రండి..


Ponguleti: పొంగులేటి మహా ముదురు. పొలిటికల్ జంక్షన్లో నిలబడి.. ఖతర్నాక్ గేమ్ ఆడుతున్నారు. బీఆర్ఎస్‌తో వేటు వేయించుకున్నారు. ఇక, రండి బాబు రండి అంటూ ప్రతిపక్షాలతో బేరమాడుతున్నారు. ఆయనకు కావలసింది డబ్బు, దస్కం కాదు. పొంగులేటినే ఓ బిగ్ షాట్. ఆయనే ఎంతైనా పెట్టగల రిచ్ లీడర్. పొంగులేటి టార్గెట్ అంతా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే టికెట్లు, సీట్లు. ఎవరొస్తారో రండి.. ఎన్నిస్తారో చెప్పండి.. అంటూ పొలిటికల్ యాక్షన్ పెడుతున్నారు.

రెబెల్ వాయిస్ వినిపించగానే.. పొంగులేటి బీజేపీలోకి అంటూ ప్రచారం జరిగింది. కానీ, అందులోకి కాదని తేలిపోయింది. ఆ తర్వాత షర్మిల డీల్ చేశారు. ఈయన హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ రంగంలోకి దిగింది. రాహుల్ టీమ్ మారథాన్ మీటింగ్ జరిపింది. అవుట్‌కమ్ ఏంటో బయటకు రానీయలేదు. అంతలోనే కమలనాథులు మేమున్నామంటూ ఖమ్మంలోని ఆయన ఇంటికి క్యూ కట్టారు. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏనుగు రవీందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఇలా కాషాయ పెద్దలంతా గుంపుగా పొంగులేటి ఇంటికెళ్లారు. ఒక్కరి కోసం అంతమందా? పాలమూరు జిల్లాకు చెందిన మరో రెబల్ లీడర్ జూపల్లి కృష్ణారావును సైతం అక్కడికే రప్పించారు. ఇద్దరితో కలిసి హోల్‌సేల్ ప్యాకేజీపై చర్చలు జరిపారు.


ఏం చర్చిస్తారు? మా పార్టీలోకి రండి అని వాళ్లు అడుగుతారు.. వస్తే ఎన్ని సీట్లు ఇస్తారని వీళ్లు అడుగుతారు.. మీకెన్ని కావాలో చెప్పండి హైకమాండ్‌తో మాట్లాడుతాం అని అంటారు. అసలే ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. గట్టిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లేడు. అలాంటిది పొంగులేటి వస్తే.. కమలనాథులకు ఖమ్మంలో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టే. ఆ లెక్కన.. ఆయన అడిగినన్ని సీట్లు ఇచ్చినా ఇచ్చేస్తారు. తప్పదుమరి.

అటు, కాంగ్రెస్ సైతం భట్టి స్థానం మినహా మిగతా 9 సీట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టే ఉంది. రేణుకా చౌదరి లొల్లిలొల్లి చేసింది అందుకే. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్.. రెండు పార్టీలూ పొంగులేటి డిమాండ్లకు జీహుజూర్ అంటుండటంతో.. మళ్లీ ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. తాను ఏ పార్టీలోకి వెళితే తనకు లాభమో.. గెలుపు ఈజీనో.. కేసీఆర్‌ను దెబ్బ కొట్టడం సాధ్యమో.. ఆ పార్టీలోకి వెళ్లేలా లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే, అన్నిపార్టీలతో చర్చలు అయితే జరుపుతున్నారు కానీ.. ఏ పార్టీకి కమిట్ కాలేకపోతున్నారు. ఈ నెలలోనే ఏదో ఒకటి తేల్చేస్తానని మాత్రం చెబుతున్నారు.

ఇక, బీజేపీ నేతలతో మీటింగ్ తర్వాత ఇదే విషయం చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీజేపీ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని వర్గాలను సంఘటితం చేయాలని.. అందులో భాగంగానే బీజేపీ నేతలతో చర్చించినట్లు వివరించారు. మరిన్ని చర్చలు జరుగుతాయని.. హడావుడికి నిర్ణయం తీసుకోలేమని.. ఇంకా టైం పడుతుందంటూ.. మళ్లీ వ్యూహాత్మక సమాధానం చెప్పారు.

వామ్మో పొంగులేటి.. బాగా బతక నేర్చిన లీడర్‌లా ఉన్నారంటున్నారు ఆయన తీరు చూస్తున్నవారంతా. అన్ని పార్టీలతో చర్చలు జరిపి.. అందరికీ హ్యాండ్ ఇచ్చి.. చివరాఖరికి సొంతంగా పార్టీ అయితే పెట్టరుగా? పెట్టినా పెట్టగలరు.. అంతటి అర్థ, అంగ బలం ఉన్న నాయకుడు మరి.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×