EPAPER
Kirrak Couples Episode 1

Mohammed Shami:- ఫార్మాట్లు మారొచ్చు గాని. దూకుడు మారదు.. దటీజ్ షమీ

Mohammed Shami:- ఫార్మాట్లు మారొచ్చు గాని. దూకుడు మారదు.. దటీజ్ షమీ

Mohammed Shami:- ప్రతి బ్యాట్స్‌మెన్‌కు రెండు ఆప్షన్స్ ఉంటాయి. వచ్చే బాల్‌ను కొట్టాలా లేక వదిలేయాలా అని. అలా అని ప్రతీ బాల్ విషయంలో ఇలాంటి ఆప్షన్స్ తీసుకోరు. ముందైతే బాదేద్దాం అనే అనుకుంటారు. కాని, మహ్మద్ షమీ బౌలింగ్ వేస్తున్నాడంటే మాత్రం.. ప్రతి బాల్‌కి ముందు ఈ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తుంటారు బ్యాటర్స్. వరల్డ్ క్రికెట్లో ఇలాంటి బౌలర్లు చాలా అరుదు. ఢిల్లీ క్యాపటల్స్‌తో జరిగిన మ్యాచులో ఈ గుజరాత్ టైటన్స్ బౌలర్ అదరగొట్టాడు. పవర్ ప్లే కంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ 23 పరుగులకు ఐదు వికెట్లు పోగొట్టుకుందంటే కారణం మహ్మద్ షమీనే. మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్‌ను ఔట్ చేశాడు. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు పడగొట్టింది షమీనే. పవర్ ప్లేలో 12 వికెట్లు పడగొట్టాడు. మరో ఇండియన్ బౌలర్.. బెంగళూరు తరపున ఆడుతున్న మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో 8 వికెట్లు పడగొట్టి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.


షమీ ఎకానమీ జస్ట్ 6 అబౌవ్ ఉంది. యావరేజ్ 12.75. స్ట్రైక్ రేట్ 12.5. అంటే.. పవర్ ప్లేలో షమీ గనక మూడు ఓవర్లు వేస్తే.. అందులో ఒక వికెట్ కచ్చితంగా తీసేస్తాడనేది గణాంకాలు చెబుతున్నాయి. పైగా అక్యూరసీలో మహ్మద్ షమీని కొట్టేవారే లేరు. టీ20 ఫార్మాట్లో కావాల్సిందే ఇది. ఈ విషయంలో షమీ ది బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. మొన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా సెన్సేషనల్ మూమెంట్ అంటూ ట్వీట్ చేశాడు.

ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ షమీ.. 17 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నమోదు చేసిన స్టాట్స్ ది బెస్ట్. 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షమీ మొత్తం ఐపీఎల్ కేరీర్‌లో ఇవే బెస్ట్ బౌలింగ్ గణాంకాలు.


Related News

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Team India: టీ20 అనుకుని రెచ్చిపోయారు…147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో టీమిండియా ‘ఫాస్టెస్ట్‌’ రికార్డులు

Big Stories

×