EPAPER
Kirrak Couples Episode 1

Tollywood News : టాలీవుడ్‌కు ఏప్రిల్ సంక్షోభం.. ఇంత దెబ్బేసిందేంటి?

Tollywood News : టాలీవుడ్‌కు ఏప్రిల్ సంక్షోభం.. ఇంత దెబ్బేసిందేంటి?


Tollywood News : ఏప్రిల్ నెల సినిమాలకు కలిసిరాదేమో. గతేడాది భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య ఏ రేంజ్ ఫట్ అయిందో చెప్పక్కర్లేదు. కొరటాల శివ డైరెక్షన్. అందులోనూ చిరంజీవి. పైగా రామ్ చరణ్. ఇంత పెద్ద కాంబినేషన్‌పై సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. కాని, ఫస్ట్ షోలోనే ఆచార్య తేలిపోయింది. బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. మళ్లీ సరిగ్గా ఏడాది తరువాత.. మొన్న ఏప్రిల్ నెల కూడా టాలీవుడ్‌కు భారీ నష్టాన్ని ఇచ్చింది. పోయిన ఏడాది ఆచార్య ఒక్కటే. ఈ ఏడాది ఎన్ని డిజాస్టర్లో తెలుసా. ఒక్కొక్కటిగా చెప్పుకుందాం.

రావణాసుర. రవితేజ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసిన సినిమా. అంత అవసరం లేదు బట్.. ఐదుగురు హీరోయిన్లను పెట్టారు. సుశాంత్‌ను విలన్‌గా పెట్టారు. ఇక ఎంత హైప్ క్రియేట్ చేశారో. రవితేజ నుంచి బ్లాక్ బస్టర్ ఖాయం అనుకున్నారు. తీరా చూస్తే సినిమా రిజల్ట్ ఢమాల్. అక్కడి నుంచి మొదలైంది వరస. డిజాస్టర్లకు ఏప్రిల్ నెల కేరాఫ్‌గా మారింది.


శాకుంతలం. తన లైఫ్‌లో ఇంత పెద్ద జర్క్ ఎప్పుడూ తినలేదని సాక్షాత్తు దిల్ రాజు అన్నాడంటే అర్థం చేసుకోండి. రెండో రోజు నుంచి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ జస్ట్ లక్షల్లో. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి.. ఏ ఒక్క లాంగ్వేజ్‌లోనూ సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదీ సినిమా. ప్రమోషన్స్ మాత్రం వీరలెవెల్లో చేశారు. తిరుగులేని సినిమాగా ప్రమోట్ చేశారు. సమంతను చూపించి బాలీవుడ్‌లోనూ మార్కెట్ చేసుకున్నారు. దీన్ని చూసిన ప్రేక్షకులు.. అమ్మ బాబోయ్ ఇది సినిమానా అనేశారు.

ఏజెంట్. 40 కోట్ల సినిమాకు 80 కోట్లు ఖర్చు పెట్టించి మరీ జనాల మీదకు వదిలారు. ఇక అఖిల్ చెప్పిన మాటలకు, సినిమాలో ఉన్న మ్యాటర్‌కు ఎక్కడా పొంతనే లేదు. ఫస్ట్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా మిక్స్డ్ టాక్ వచ్చి హిట్ అయిన సినిమాలున్నాయి. కాని, రెండో రోజు డిజాస్టర్ అనేశారు. పాపం ఎవరి మీదో మొహమాటంతో ఫస్ట్ రోజు యావరేజ్ అని రేటింగ్ ఇచ్చి ఉంటారు. 80 కోట్ల బడ్జెట్ సినిమాకు 8 కోట్లు కూడా రాలేదు.

మీటర్. కిరణ్ అబ్బవరం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఇది. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా భారీ హిట్ అవడంతో.. ఓ సెక్షన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈసారి కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి బోల్తా కొట్టాడు. మీటర్ గిర్రున తిరిగింది.

తెలుగే కాదు.. తమిళ డబ్ సినిమాలదీ అదే పరిస్థితి. రుద్రుడు అనే ఓ సినిమా వచ్చిందని చాలా మందికి తెలీదు కూడా. హీరో మన లారెన్స్ రాఘవ. ఏ తాండవం చేయకుండానే కనుమరుగైపోయాడు. ఈ సినిమా తమిళంలోనే ఆడలేదు.. ఇక తెలుగులో చెప్పక్కర్లేదు. ఇక వెట్రిమారన్ తీసిన విడుదల కూడా విడుదలైంది. పేరుకైతే థియేటర్లలో విడుదలైంది గానీ.. జనమే థియేటర్లకు వెళ్లలేదు. దీంతో సినిమాను థియేటర్ల నుంచి పీకేశారు.

పొన్నియన్ సెల్వన్-2. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే కాస్త మెరుగ్గానే ఉందన్న టాక్ వినిపించినప్పటికీ… ఎందుకో జనాలు ఈ సినిమాకు వెళ్లడం లేదు. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్లు సెకండ్ పార్ట్ చూడకపోవచ్చు. పీఎస్-1 చూసిన వాళ్లు ఆ షాక్ నుంచి తేరుకోలేదు కాబట్టి పీఎస్-2 చూసే అవకాశం లేదు. సో, దీన్ని ఫట్ అనాలో హిట్ అనాలో యావరేజ్ అనాలో తెలియని పరిస్థితి.

పాపం ఏప్రిల్ నెలను ఇంతలా తిట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే.. విరూపాక్ష సినిమా వచ్చింది ఏప్రిల్‌లోనే. వంద కోట్ల కలెక్షన్స్ దిశగా వెళ్తున్న ఈ సినిమా.. త్వరలోనే పాన్ ఇండియా కలర్ పూసుకుంటోంది. 

Related News

Devara 4 Days Collections : సునామీ సృష్టిస్తున్న దేవర.. 4 రోజులకు ఎన్ని కోట్లంటే?

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?

Simbu : నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి.. అసలు మ్యాటరేంటంటే?

Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం… ఇక ఇండస్ట్రీలో ఈ ఓటీటీ దూరం .. అవ్వనుందా ?

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Veena Srivani: ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్.. క్షమాపణ చెప్పండి.. వేణుస్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

Big Stories

×