EPAPER
Kirrak Couples Episode 1

Thalapathy Vijay : వెయ్యి కోట్ల సినిమాపై విజయ్ స్కెచ్…

Thalapathy Vijay : వెయ్యి కోట్ల సినిమాపై విజయ్ స్కెచ్…


Thalapathy Vijay : ఇండియాలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ. వెయ్యి కోట్ల మార్క్ ఓ బాలీవుడ్ సినిమా దాటడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కాని, ఆ రేర్ ఫీట్ టాలీవుడ్ చివరికి శాండిల్‌వుడ్ నుంచి కూడా రావడమే కోలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఎప్పటి నుంచో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కోలీవుడ్‌లో ఇప్పటి వరకు ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా లేదు. దంగల్ సినిమా ఏకంగా 2వేల కోట్లు కొల్లగొట్టింది. దీన్ని మించిన సినిమా లేదు ఇండియాలో. ఆ తరువాత పొజిషన్‌లో ఉన్నది బాహుబలి-2. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా 1260 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినియా వరల్డ్ సినిమా స్క్రీన్స్‌లో ఇంకా ఆడుతూనే ఉంది. ఆస్కార్ వచ్చిన తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రేజ్ పెరిగింది. ఇక శాండిల్ వుడ్ నుంచి కూడా ఓ భారీ హిట్ వచ్చింది. కేజీఎఫ్-2 సినిమా 1250 కోట్లు వసూలు చేసింది. నిన్న గాక మొన్న వచ్చిన పటాన్ సినిమా కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. అంటే.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఐదు ఉంటే.. అందులో రెండు తెలుగు, రెండు హిందీ, ఒకటి కన్నడ సినిమా.

వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కోలీవుడ్ నుంచి ఒక్కటి కూడా లేదు. ఎప్పుడో 2018లో వచ్చిన 2.O సినిమా 800 కోట్లు రాబట్టింది. తమిళ్ నుంచి ఇదే హైయెస్ట్ గ్రాస్ మూవీ. అది కూడా టాప్ నుంచి 9వ ప్లేస్‌లో ఉంది. అందుకే, తమిళ్ నుంచి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించే సినిమా తీయాలనుకుంటోంది కోలీవుడ్. ఈ వెయ్యి కోట్లపై కన్నేసిన హీరో.. విజయ్. ప్రస్తుతం విజయ్.. లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం కంప్లీట్ అయింది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ నడుస్తోంది. వచ్చే దసరా నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.


లియో సినిమా కలెక్షన్స్ వెయ్యి కోట్లు క్రాస్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు హీరో విజయ్. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 300 కోట్లు దాటాల్సిందేనంటున్నాడు. తెలుగు, తమిళ్‌లో గట్టిగా కొడితే.. వెయ్యి కోట్లు అసాధ్యమేం కాదు. కాకపోతే.. దీనికి బాలీవుడ్ అప్పీరియెన్స్ కూడా ఉండాలి. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే.. అదే సమయానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా జైలర్ కూడా రిలీజ్ కాబోతోంది. పైగా దసరా సమయానికి తెలుగు సినిమాలు కూడా పోటీలో ఉంటాయి. ఓ కాంతారా, ఓ కేజీఎఫ్, ఓ ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో.. విజయ్ లియో సినిమా ఉంటే తప్ప వెయ్యి కోట్లు సాధ్యం కాకపోవచ్చు. చూడాలి మరి.. విజయ్ వెయ్యి కోట్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. 

Related News

Devara 4 Days Collections : సునామీ సృష్టిస్తున్న దేవర.. 4 రోజులకు ఎన్ని కోట్లంటే?

Rajinikanth : రజినీకాంత్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

Rajinikanth: అర్థరాత్రి ఆసుపత్రికి రజనీకాంత్, ఏమైంది?

Simbu : నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి.. అసలు మ్యాటరేంటంటే?

Top OTT Platform : టాలీవుడ్ లో భారీ స్కాం… ఇక ఇండస్ట్రీలో ఈ ఓటీటీ దూరం .. అవ్వనుందా ?

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Veena Srivani: ప్రాయశ్చిత్త శ్లోకాలంటూ ఓవర్ యాక్షన్.. క్షమాపణ చెప్పండి.. వేణుస్వామి భార్య సంచలన వ్యాఖ్యలు

Big Stories

×