EPAPER

Crude oil : క్రూడాయిల్ సరఫరా చేసే అతిపెద్ద దేశంగా భారత్

Crude oil : క్రూడాయిల్ సరఫరా చేసే అతిపెద్ద దేశంగా భారత్


Crude oil : యూరోపియన్ యూనియన్ దేశాలకు క్రూడాయిల్ రిఫైన్ చేసి అమ్ముతున్న అతి పెద్ద దేశంగా ఇండియా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా, యూరప్ దేశాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చితే.. భారత్‌కు మాత్రం బాగా మేలు చేసింది. రష్యాను అణచివేయడానికి యూరప్ దేశాలు ఎన్నో ఆంక్షలు పెట్టాయి. రష్యా క్రూడాయిల్‌ను కొనేది లేదని, దాన్ని బ్యాన్ చేస్తున్నామని ప్రకటించాయి. తీరా  చూస్తే అదే రష్యా ఆయిల్‌ను ఇండియా నుంచి కొంటున్నాయి యూరప్ దేశాలు. గతంలో ఎప్పుడూ లేనంతగా రష్యా నుంచి భారీ మొత్తంలో క్రూడాయిల్ కొంటోంది ఇండియా. ఎంతలా అంటే.. రష్యా నుంచి క్రూడాయిల్‌ను రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిన దేశంగా అగ్రస్థానం ఇండియాదే.

సో, రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న ఇండియా… దాన్ని రిలయన్స్ జామ్ నగర్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వం, ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు పంపించి, దాన్ని రిఫైన్ చేసి తిరిగి యూరప్ దేశాలకే అమ్ముతోంది ఇండియా. ప్రస్తుతం యూరప్ దేశాల అవసరాలు తీరుస్తున్నది రష్యా నుంచి క్రూడాయిల్ కొంటున్న ఇండియానే.


యూరప్ దేశాలకు ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతులు రష్యా నుంచే జరిగేవి. ఇప్పుడు.. అదే క్రూడాయిల్ ఇండియాకు వచ్చి, ఇండియా నుంచి మళ్లీ యూరప్ దేశాలకు రవాణా అవుతోంది. మరోవైపు ఇండియాకు తప్ప వేరే దేశాలకు క్రూడాయిల్ రేటు భారీగా పెంచింది రష్యా. దీంతో యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఇండియాపైనే ఆధారపడ్డాయి. బయట దేశాల నుంచి ఆర్డర్స్ వస్తుండడంతో.. ఇండియా కూడా రష్యా క్రూడాయిల్ ఇంపోర్ట్స్ భారీగా పెంచింది. ఏప్రిల్ నెలలో రోజుకు 3 లక్షల 60వేల బ్యారెళ్లకు పైగా క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది.

రిఫైన్డ్ ఫ్యూయెల్ సెగ్మెంట్‌లో ఇప్పుడు ఇండియానే లీడర్. యూరప్ దేశాలన్నీ మన దగ్గర్నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుండడంతో.. భారత్ అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది. ప్రస్తుతం యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్‌ను సరఫరా చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించినట్లు కెప్లర్ వెల్లడించింది. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×